- Telugu News Photo Gallery Are these symptoms showing up in your pet dog? You should consult a doctor.
మీ పెట్ డాగ్లో ఈ లక్షణాలు ఉన్నాయా.? డాక్టర్ని సంప్రదించాల్సిందే
నేటి జీవనశైలి కారణంగా చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే అది మీ మానసిక ఆరోగ్యాన్ని కాకుండా మీ పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును.. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి.. మరీ ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందామా..
Updated on: Aug 17, 2025 | 11:04 AM

కుక్కల లాలాజలం, చర్యల ద్వారా కూడా అవి దూకుడుగా ఉన్నాయని కొన్ని సంకేతాలు ఇస్తాయి. కుక్కలు చాలా ఒత్తిడికి గురైతే అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి.

ఒక కుక్క తోకను పైకి లేపి చెవులు గుచ్చుకుంటూ ఉంటే.. అది కోపంగా ఉందని అర్ధం చేసుకోవాలి. అయితే ఇవి కేవలం బహిరంగంగా కనిపించే అంచనాలు మాత్రమే. కాబట్టి మీ ఇంట్లో కుక్కను దగ్గరికి తీసుకునే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ పాండే అంటున్నారు.

ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి శాస్త్రవేత్తలు 18 జతల కుక్కలను, వాటి యజమానులను ఎంచుకున్నారు. పెంపుడు జంతువులు వాటి యజమానులను విడిగా ఉంచారు. అక్కడ వాటికి ఆట పరికరాలు అందించి, బహిరంగ ప్రదేశంలో వదిలిపెట్టారు. తద్వారా అవి ఒత్తిడి లేకుండా ఉంటాయి. కానీ పరిశోధకులు కుక్క యజమానిని మానవ ఒత్తిడికి గురి చేశారు.

నిత్యం తమ చుట్టూ తిరిగే పెంపుడు కుక్కలు ఉన్నట్లుండి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో తెలియక యజమానులు ఆశ్చర్యపోతుంటారు. పెట్ డాగ్స్ ఇలా దూకుడుగా మారే ముందు మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

మీ పెంపుడు జంతువు రోజులో ఎంత నీరు తీసుకుంటుందో ట్రాక్ చేయాలి. అది పదేపదే నీరు అడుగుతున్నట్లు మీరు గమనిస్తే మధుమేహం లేదా మూత్రపిండాల సమస్య ఉందేమో టెస్ట్ చేయించాలి. అలాగే మీ పెంపుడు జంతువు తరచుగా మూత్రవిసర్జన చేస్తుందో లేదో గమనించాలి. ఆకలి తగ్గడం, కళ్లు మసకబారినట్లు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.




