- Telugu News Photo Gallery If you feel tired for no reason, you may be experiencing some health problems.
త్వరగా అలసిపోతున్నారా? అనారోగ్యం నాటు నాటు స్టెప్స్ వేస్తున్నట్టే
ప్రస్తుతం చాలా మంది అలసటతో బాధపడుతున్నారు. చిన్న చిన్న పనులకే నీరసంగా ఉంటున్నారు. నాలుగు మెట్లు దిగినా, నాలుగు అడుగులు వేసినా వెంటనే అలసిపోతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సరిగ్గా భోజనం చేయకపోయినా, జ్వరం, జలుబు ఇలాంటి కారణాల వల్ల అలసిపోతుండడం సర్వసాధారణమైన విషయం. అయితే ఎలాంటి కారణం లేకుండా అలసిపోతుంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇలాంటి సమస్య ఎదురైతే మీలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లే భావించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 17, 2025 | 10:52 AM

ఉన్నపలంగా అలసిపోతుంటే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో సరిపడ ఎర్రరక్తకణాలు లేకపోతే శరీరం త్వరగా అలసిపోతుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్లే ఎర్రరక్త కణాలు లేకపోతే త్వరగా అలసిపోతుంటారు.

త్వరగా అలసిపోవడానికి ధైరాయిడ్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే.. అలసట ప్రారంభమవుతుంది. హార్మోన్లు తక్కువగా విడుదల కావడం వల్ల జీవక్రియ మందగిస్తుంది, దీనిని హైపోథైరాయిడిజం అంటారు. ఈ కారణంగా శరీర కండరాల్లో అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డయాబెటిస్ బారిన పడిన వారు కూడా త్వరగా అలసిపోతుంటారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల శరీరం గ్లూకోజ్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతుంది, దీని కారణంగా ఇది రక్తంలో కరిగిపోయి అలసటను కలిగిస్తుంది.

ఇక త్వరగా అలసిపోవడానికి మరో కారణం డిప్రెషన్. ఇటీవల ఈ సమస్య బాగా ఎక్కువుతోంది. శారీరక శ్రమ కంటే, మానసిక ఒత్తిడి కారణంగా అలసిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒత్తిడి కారణంగా తరచూ అలసిపోతుంటారు.

శరరీరం త్వరగా అలసిపోవడానికి మరో ప్రధాన కారణం.. అర్థరైటిస్. శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలపై ఆర్థరైటిస్ దాడి ఎముకలత పాటు కణాలపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా శరీరం త్వరగా అలసిపోయిన భావన కలుగుతుంది.

నిద్రలేమి కూడా అలసటకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోకపోతే అది రోజంతా ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో నిత్యం అలసిపోయినట్లు కనిపిస్తారు.




