కుంభ రాశివారికి ఎగిరి గంతేసే న్యూస్.. దీపావళి తర్వాత మీ సుడి తిరిగినట్లే!
చీకటిని తెలిగించి వెలుగునిచ్చే పండుగ దీపావళి. ఈ పండుగ అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 20 తేదీన సోమవారం రోజున వస్తుంది. అయితే కుంభ రాశి వారికి ఈ దీపావళి అద్భుతమైన మార్పులకు నాంది పలుకబోతోందని చెబుతున్నారు పండితులు. గతంలో ఎదుర్కొన్న ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య చింతలు తొలగిపోయి నూతన ఆశలు చిగురిస్తాయి. కెరీర్, వ్యాపారంలో పురోగతి, ఊహించని ధనలాభం, కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం మెరుగుపడతాయి. గ్రహాల అనుకూల సంచారం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు.
Updated on: Oct 17, 2025 | 2:09 PM

పండుగలు మన జీవితంలో ఆనందాన్ని, కొత్త ఆశలను నింపుతాయి. అలాంటి పండుగలలో దీపావళి ఒకటి. అక్టోబర్ 24న జరుపుకోబోయే ఈ దీపావళి కుంభ రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గత కొన్ని నెలలుగా, ముఖ్యంగా అక్టోబర్ మొదటి భాగంలో, కుంభ రాశి వారు ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, వృత్తి, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. అయితే, దీపావళి నుండి ఈ ప్రతికూలతలు తొలగిపోతాయి. గ్రహాల అనుకూల సంచారం కుంభ రాశి వారికి విజయాన్ని అందిస్తుంది.

దీపావళి తర్వాత కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ ప్రతిభను చాటుకుని, అధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతి లేదా వేతన పెంపునకు అవకాశం ఉంది. కొందరికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. పండుగ అమ్మకాలతో వ్యాపారం వృద్ధి చెందుతుంది, కొత్త కస్టమర్లు చేరుతారు. నిలిచిపోయిన డీల్స్ తిరిగి ప్రారంభమవుతాయి. ఇనుము, నూనెలు, నిర్మాణం, టెక్నాలజీ రంగాలు ముఖ్యంగా లాభపడతాయి.

దీపావళి తర్వాత కూడా కుంభ రాశి వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వ్యాపారులకి దీపావళి తర్వాత లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. పండుగ అమ్మకాలతో మీ వ్యాపారం పుంజుకుంటుందని, కొత్త కస్టమర్లు వస్తారని అంచనా. గతంలో ఆగిపోయిన డీల్స్ మళ్ళీ ముందుకు కదలుతాయి. కొత్త భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరించాలనే మీ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు, లైసెన్సుల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందవచ్చు.

నిరుద్యోగులకు ఇది మంచి సమయం. దీపావళి పండుగ తర్వాత మీలో ఉన్న నిరాశ, బద్ధకాన్ని వదిలేయాలిప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, తప్పకుండా మంచి ర్యాంకు సాధిస్తారని అంచనా. ఏకాగ్రత పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. మీ కెరీర్‌లో మీకు ఉన్న ఆటంకాలు అన్నీ తొలిగిపోతాయి. చేపట్టిన ప్రతి పనుల్లో విజయం మీదే అవుతుంది.

దీపావళి తర్వాత ఈ రాశి వారికి లక్ష్మీదేవి సిరి సంపదల వర్షం కురిపిస్తుంది. శుక్ర గ్రహం మీకు అనుకూలంగా మారడం వల్ల మీ ఆదాయం పెరగడానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో జీతం పెరగడం, వ్యాపారంలో లాభాలు రావడం మాత్రమే కాకుండా, ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు చేతికి అందవచ్చు. కొందరికి పూర్వీకుల ఆస్తి నుండి వాటా రావొచ్చు, మరికొందరికి గతంలో ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావొచ్చు. భార్యాభర్తల ద్వారా కూడా ధనలాభం కలిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకుని, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. డబ్బు వస్తుంది కదా అని విపరీతంగా ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా పండుగ తర్వాత వచ్చే ఆన్‌లైన్ సేల్స్, ఆఫర్ల మాయలో పడి అనవసరమైన వస్తువులు కొనకుండా ఉండాలి.



