Anti Aging Tips For 30’S: రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె ఇలా వాడితే.. చర్మంపై ముడుతలు రానేరావు!
చర్మం ముడుతలు పడుతోందా? ప్రారంభ దశలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వృద్ధాప్య సంకేతాలను చాలా వరకు నివారించవచ్చు. నిజానికి ముడతలు పడిన చర్మం, నుదుటిపై ముడతలు, కళ్లకింద నల్లటి మచ్చలు వృద్ధాప్య సంకేతాలు. సన్‌స్క్రీన్ లేకుండా ఎక్కువసేపు సూర్యరశ్మి సోకేలా ఉంటే చర్మం త్వరగా ముడుతలు పడుతుంది. దీనితోపాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపాన అలవాట్లు చర్మానికి మరింత హానికరం. ఈ కారణాల వల్ల వయసు కంటే ముందే ముఖంపై ముడతలు వస్తాయి. మరో రకంగా చెప్పాలంటే, అనియంత్రిత జీవనశైలి చర్మ వేగవంతమైన వృద్ధాప్యానికి దారితీస్తుంది..
Updated on: Jan 19, 2024 | 7:53 PM

చర్మం ముడుతలు పడుతోందా? ప్రారంభ దశలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వృద్ధాప్య సంకేతాలను చాలా వరకు నివారించవచ్చు. నిజానికి ముడతలు పడిన చర్మం, నుదుటిపై ముడతలు, కళ్లకింద నల్లటి మచ్చలు వృద్ధాప్య సంకేతాలు. సన్‌స్క్రీన్ లేకుండా ఎక్కువసేపు సూర్యరశ్మి సోకేలా ఉంటే చర్మం త్వరగా ముడుతలు పడుతుంది. దీనితోపాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపాన అలవాట్లు చర్మానికి మరింత హానికరం. ఈ కారణాల వల్ల వయసు కంటే ముందే ముఖంపై ముడతలు వస్తాయి. మరో రకంగా చెప్పాలంటే, అనియంత్రిత జీవనశైలి చర్మ వేగవంతమైన వృద్ధాప్యానికి దారితీస్తుంది.

ముడతలు పోవడానికి చాలా మంది యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడుతుంటారు. ఇది కూడా చాలా వరకు పని చేస్తుంది. కానీ ముడుతలను పూర్తిగా పోగొట్టదు. కాబట్టి యాంటీ ఏజింగ్ క్రీమ్‌కు బదులు కొబ్బరి నూనెను ముఖానికి రాసుకోవడ బెటర్ అంటున్నారు సౌందర్య నిపుణులు.

కొబ్బరి నూనె చర్మాన్ని తేమను అందిస్తుంది. ఇది చర్మంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ముఖంపై కొబ్బరి నూనెను రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల చర్మ స్థితిస్థాపకత మెరుగుపడుతుంది. ముడుతలు పడకుండా చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

పొడి చర్మం వల్ల ముడతలు ఎక్కువగా వస్తాయి. అయితే కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల ఈ సమస్య దూరం చేయవచ్చు. కొబ్బరి నూనె ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మానికి పోషణనిస్తుంది. ఇందులో ఉండే సహజ ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా మార్చుతాయి.

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల కొబ్బరి నూనె తీసుకుని చర్మానికి బాగా మసాజ్ చేసుకోవాలి. చర్మం నూనెను పూర్తిగా పీల్చుకునే వరకు మసాజ్ చేసుకోవాలి. తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడిచేసుకోవాలి. అలాగే 3 చుక్కల కొబ్బరితో 2 చుక్కల ఆముదం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయవచ్చు. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చర్మాన్ని చాలా మృదువుగా చేస్తుంది. దీనివల్ల ముఖంపై ముడతలు ఏర్పడవు. విటమిన్ ఇ క్యాప్సూల్స్ సారాన్ని కొబ్బరి నూనెలో కలిపి, ఈ నూనెను ముఖానికి బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజూ రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు చేస్తే, చర్మకణాలు ఆరోగ్యంగా ఉంటాయి.




