- Telugu News Photo Gallery Cinema photos Heroine Rakul Preet Singh marriage News going viral in North media Telugu Actress Photos
Rakul Preet Singh: నార్త్ మీడియా వార్తలపై స్పందించని రకుల్.! ఆ వార్తల్లో నిజమెంత.?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటు, కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకపోయినా... తన లవ్ లైఫ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రకుల్. ఇంతకీ ఈ బ్యూటీ ఏం అన్నారు.. హ్యావ్ ఏ లుక్. కెరీర్ స్టార్టింగ్ నుంచీ తాను చేయాలనుకున్న పనిమీద స్పష్టమైన అవగాహన ఉన్న నటి రకుల్ ప్రీత్‌సింగ్. అందుకే ఓ వైపు నటిగా కంటిన్యూ అవుతూనే, మరోవైపు ఫిట్‌నెస్ ఫ్రీక్‌గానూ తనని తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ.
Updated on: Jan 19, 2024 | 9:58 PM

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటు, కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకపోయినా... తన లవ్ లైఫ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రకుల్.

ఇంతకీ ఈ బ్యూటీ ఏం అన్నారు.. హ్యావ్ ఏ లుక్. కెరీర్ స్టార్టింగ్ నుంచీ తాను చేయాలనుకున్న పనిమీద స్పష్టమైన అవగాహన ఉన్న నటి రకుల్ ప్రీత్‌సింగ్. అందుకే ఓ వైపు నటిగా కంటిన్యూ అవుతూనే, మరోవైపు ఫిట్‌నెస్ ఫ్రీక్‌గానూ తనని తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ.

అదే సమయంలో మంచి నటిగానూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సోషల్ లైఫ్‌లోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు రకుల్. అందుకే ఇన్‌స్టా ఫాలోయర్ల విషయంలో చాలా మంది కంటే ముందే ఉన్నారు ఈ బ్యూటీ.

కొద్ది రోజులుగా సిల్వర్ స్క్రీన్ మీద స్పీడు తగ్గినా, లవ్ లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో ట్రెండింగ్‌లోనే ఉంటున్నారు రకుల్. ముఖ్యంగా అమ్మడి పెళ్లి వార్తలు నార్త్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ న్యూస్‌పై స్పందించకపోయినా.. తనకు కాబోయే లైఫ్ పార్టనర్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రకుల్. చాలా కాలంగా బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు రకుల్.

రీసెంట్ ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి మాట్లాడారు. గ్లామర్ ఫీల్డ్ ఉన్న వాళ్ల గురించి చాలా రూమర్స్ వస్తుంటాయి. నేను, జాకీ ఇద్దరం ఇదే ఫీల్ట్ ఉన్నాం కాబట్టి.. అలాంటి పరిస్థితులను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగాం అన్నారు.

రోజులో ఎక్కువ భాగం ఎవరి పనుల్లో వాళ్లం ఉంటాం, కాబట్టి ఒకటి, రెండు గంటలకు మించి కలిసే అవకాశం ఉండదు.

ఆ కొద్ది టైమ్ మాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోడానికి ఇష్టపడతాం అన్నారు. అయితే ఈ కామెంట్‌తో రకుల్ లివ్ఇన్ రిలేషన్‌లో ఉన్నారా అన్న డిస్కషన్ మొదలైంది.




