Taapsee Pannu – Mathias Boe: ఈ జీవితానికి అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న తాప్సీ పన్ను.!
తాప్సీ పన్ను ఇప్పుడు నార్త్ గర్ల్ గా చలామణి అయితే అవుతుండవచ్చు కానీ, ఇంతకు ముందు తాప్సీ అంటే సౌత్ అమ్మాయే. దక్షిణాదిన దాదాపుగా టాప్ స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేశారు తాప్సీ. నార్త్ లో సెటిలైన ఈ ఢిల్లీ గర్ల్ ఇటీవల షారుఖ్‌ఖాన్‌తో డంకీలో నటించారు. గత కొన్నేళ్లుగా ఆమె మథియాస్ బోతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ బాండింగ్ గురించి తాప్సీ మాట్లాడుతూ ''ఇప్పటికి పదేళ్లయింది మథియాస్ పరిచయమై అతనితో పరిచయం, ప్రేమ, జీవితం చాలా బావుంది. చాలా సంతోషంగా ఉన్నాను.