- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda fans excited as two new movies to come with previous hit combination
ఖుషీ ఖుషీగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ !! అసలు విషయం ఏంటంటే ??
ఖుషీ సినిమా సక్సెస్‌తో ఖుషీ ఖుషీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఆయన ఆనందానికి రీజన్ ఖుషీ అయితే, ఆయన ఫ్యాన్స్ హ్యాపీనెస్‌కి రీజన్ ఇంకోటుంది. ఆ హ్యాపీన్యూస్‌ని విజయ్ దేవరకొండ షేర్ చేయకపోయినా, ఇప్పటికే హ్యాపీగా స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా విషయం? చూసేద్దాం రండి.. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ అని ప్రూవ్ చేసిన సినిమా ఖుషి. మంచి ఫ్యామిలీ సబ్జెక్టులు, లవ్ స్టోరీలు విజయ్ దేవరకొండకి ఎప్పుడూ పాజిటివ్ రిజల్ట్ తెచ్చిపెడతాయని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా అది.
Updated on: Jan 19, 2024 | 1:25 PM

ఖుషీ సినిమా సక్సెస్‌తో ఖుషీ ఖుషీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఆయన ఆనందానికి రీజన్ ఖుషీ అయితే, ఆయన ఫ్యాన్స్ హ్యాపీనెస్‌కి రీజన్ ఇంకోటుంది. ఆ హ్యాపీన్యూస్‌ని విజయ్ దేవరకొండ షేర్ చేయకపోయినా, ఇప్పటికే హ్యాపీగా స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా విషయం? చూసేద్దాం రండి....

విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ అని ప్రూవ్ చేసిన సినిమా ఖుషి. మంచి ఫ్యామిలీ సబ్జెక్టులు, లవ్ స్టోరీలు విజయ్ దేవరకొండకి ఎప్పుడూ పాజిటివ్ రిజల్ట్ తెచ్చిపెడతాయని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా అది. లైగర్ ఫెయిల్యూర్ తర్వాత, కాస్త డిజప్పాయింట్‌మెంట్‌లో ఉన్న రౌడీ హీరో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది ఖుషి.

ఇప్పుడు అదే జోష్‌ని ఫ్యామిలీస్టార్‌తో కంటిన్యూ చేయాలన్నది మిస్టర్ దేవరకొండ ప్లాన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ మధ్య యు.ఎస్. షెడ్యూల్ పూర్తయి ఉంటే, ఈ సంక్రాంతికే సినిమా రిలీజ్ అయి ఉండేది. ఆ షెడ్యూల్ వాయిదాపడటం వల్ల ఫ్యామిలీస్టార్ సినిమా రిలీజ్‌ని కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.

ఆల్రెడీ పరశురామ్ డైరక్షన్‌లో గీత గోవిందంతో హిట్ అందుకున్నారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు సేమ్ డైరక్టర్‌తో మళ్లీ చేస్తున్నారు. వరుస విజయాల మీదున్న మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీస్టార్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ సక్సెస్‌ఫుల్‌గా గీతగోవిందం సినిమాను మించిన హిట్ అందిస్తుందన్నది టాక్.

ఫ్యామిలీస్టార్ మాత్రమే కాదు, ఈ ఏడాది విజయ్‌దేవరకొండ నటిస్తున్న మరో సినిమా కూడా విడుదలవుతుందని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే సినిమాను తాము స్ట్రీమింగ్ చేస్తామని అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్. జెర్సీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని పక్కాగా క్యాప్చర్ చేసిన గౌతమ్, ఈ సారి రౌడీ హీరో కోసం ఎలాంటి స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారోననే ఇంట్రస్ట్ కనిపిస్తోంది ఫ్యాన్స్ లో.




