చర్మవ్యాధి నిపుణుడు డా. సౌమ్య సచ్‌దేవ్ ప్రకారం.. మొటిమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటించాలి. అన్నింటిలో మొదటిది, ముఖం పరిశుభ్రతను నిర్వహించడం. మీ ముఖాన్ని రోజుకు కనీసం రెండుసార్లు కడగాలి. ఉదయం, రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా కడగడం మంచిది. అలెర్జీ ఉన్న ఆహారాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. స్వీట్లు, కారంగా, వేయించిన, వేడి ఆహారాలు తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తే, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి. రోజుకు కనీసం 7 గ్లాసుల నీరు తాగాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి తగినంత నిద్ర అవసరం. ఈ పద్ధతులను ప్రయత్నించినా మొటిమల సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని డా. సౌమ్య సలహా ఇస్తున్నారు.