- Telugu News Photo Gallery Drinking Tulsi water on an empty stomach has unimaginable benefits, check here is details
Tulsi Water: ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తాగితే ఊహించ లేనన్ని లాభాలు..
తులసి మొక్కును ఎంతో పవిత్రంగా పూజిస్తారు పెద్దలు. తులసి ఆకుల్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటితో ఎన్నో రకాల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవచ్చు. తులిసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పరగడుపున ప్రతి రోజూ ఓ గ్లాస్ తులసి నీరు తాగడం వల్ల ఊహించ లేనన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా..
Updated on: Sep 06, 2024 | 9:47 PM

తులసి మొక్కును ఎంతో పవిత్రంగా పూజిస్తారు పెద్దలు. తులసి ఆకుల్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటితో ఎన్నో రకాల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవచ్చు. తులిసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

పరగడుపున ప్రతి రోజూ ఓ గ్లాస్ తులసి నీరు తాగడం వల్ల ఊహించ లేనన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అల్సర్స్, మలబద్ధకం కంట్రోల్ అవుతాయి. పేగుల్లో ఉండే మలినాలను బయటకు పంపుతాయి.

పరగడుపున ప్రతి రోజూ ఓ గ్లాస్ తులసి నీరు తాగడం వల్ల ఊహించ లేనన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అల్సర్స్, మలబద్ధకం కంట్రోల్ అవుతాయి. పేగుల్లో ఉండే మలినాలను బయటకు పంపుతాయి.

ఈ నీటిని తాగడం డయాబెటీస్‌ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తులసి రక్తంలో ఉండే షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగి.. శరీరం హెల్దీగా ఉంటుంది.

తులసి నీరు తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య కూడా తగ్గుతుంది. తలనొప్పి ఉన్నవారు తరచూ ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళనను తగ్గించి.. మనసు రిలాక్స్‌గా ఉండేలా చేస్తుంది.




