యోగా సాధన చేసే ముందు శారీరక స్థితి, సమస్యల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దాని ప్రకారం యోగాలసనాలను ఎంచుకోవాలి. యోగాలో చాలా రకాలు ఉన్నాయి. హఠ యోగా, పవర్ యోగా, బిక్రమ్ యోగా, ఆక్వా యోగా వంటివి. మీరు ఏ రకమైన యోగాను అభ్యసించాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి.