AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial intelligence: ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!

ఆధునిక కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) పరిధి క్రమంగా పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ దీని సేవలు విస్తరిస్తున్నాయి. ఏఐ పనితీరు చూసి అందరూ నివ్వెర పోతున్నారు. ప్రతి పనినీ మనిషి కంటే వేగంగా, తప్పులు లేకుండా చేయడం దీని గొప్పదనం. అదే సమయంలో ఏఐ కారణంగా చాలామంది ఉద్యోగాలు పోతాయని, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Artificial intelligence: ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
Ai
Nikhil
|

Updated on: Jan 15, 2025 | 4:09 PM

Share

ఏఐ కారణంగా జరిగే లాభనష్టాలను పక్కన పెడితే, దీన్ని ఉపయోగించి ఓ వ్యక్తి అద్బుతం చేశాడు. ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. అతడు హాయిగా నిద్రపోయినా, ఆ పనిని ఏఐ చాలా సమర్థంగా నిర్వహించింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పరిధి పెరిగిన తర్వాత ప్రతి పని చాలా సులభంగా మారింది. కథనాలు రాయడం, రెజ్యూమ్ లు రూపొందించడం, కవర్ లెటర్లు తయారు చేయడం చిటికెలో అయిపోతోంది. ఉద్యోగాల వేటలో ఉన్న ఓ వ్యక్తి ఏఐని అత్యంగా సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. ఇంట్లో తయారు చేసిన ఏఐ చాట్ బాట్ ను ఉపయోగించి వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించాడు. అవన్నీ అతడు గాఢనిద్రలో ఉండగా, ఏఐ నిర్వర్తించింది.

ఇటీవల ఓ వ్యక్తి రెడ్డిట్ లోని గెట్ ఎంప్లాయిడ్ అనే ఫోరమ్ లో ఓ కథనాన్ని పంచుకున్నాడు. తాను ఉద్యోగాల దరఖాస్తులు పంపడానికి ఏఐని ఉపయోగించి విధానాన్ని తెలిపాడు. అతడు ఏఐ బాట్ ను ఉపయోగించి ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. రాత్రి అతడు పడుకున్న తర్వాత కూడా ఏఐ బాట్ పనిచేస్తూనే ఉంది. దాదాపు వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తు పంపించింది. వాటిలో 50 కంపెనీల నుంచి అతడికి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. ఇతడు రూపొందించిన బాట్ ఆటోమెటిక్ గా పనిచేస్తుంది. ఉద్యోగ వివరణ ఆధారంగా సీవీలు, కవర్ లెటర్లు తయారు చేస్తుంది. వాటిని ఆయా కంపెనీలకు పంపిస్తుంది.

నిజానికి ఆ వ్యక్తి తయారు చేసిన ఏఐ బాట్ చాలా సమర్థవంతంగా పనిచేసింది. ఆయన సుఖంగా నిద్రపోయినప్పుడు కూడా తన పని చేసుకుంటూ వెళ్లింది. ఉద్యోగాల నోటిఫికేషన్లను పరిశీలించి, అర్హతల ఆధారంగా అన్నింటికీ దరఖాస్తులు పంపించింది. దీని ద్వారా అతడికి ఒక్క నెలలోనే దాాదాపు 50 కంపెనీల నుంచి ఇంటర్వ్యూలకు కాల్స్ వచ్చాయి. ఏఐ బాట్ తో నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతి ఉద్యోగానికి అవసరమైన నిబంధనలు, అర్హతల ఆధారంగా సీవీలు, కవర్ లెటర్లను రూపొందిస్తుంది. ఏఐ సేవలు చాలా బాగున్నాయని అనిపించినప్పటికీ, ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియంలో మానవీయ కోణాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కథనం ఏఐ కి పెరుగుతున్న ప్రాధాన్యం, డిమాండ్ గురించి తెలియజేస్తోంది. ఉద్యోగాల శోధన ప్రక్రియంలో సాంకేతికత అవసరాన్ని నొక్కి చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..