TG Rythu Bharosa: రైతు భరోసా.. ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?

TG Rythu Bharosa: సాగు యోగ్యత లేని భూములకు రైతు భరోసా స్కీమ్‌లో సాయం అందించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద.. ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు..

TG Rythu Bharosa: రైతు భరోసా.. ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2025 | 4:43 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పలు అంశాలలో మార్పులు చేర్పులు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ అమలు కాబోతుంది. ఈనెల 26వ తేదీన ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించగా, అందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం అందించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే రైతు భరోసా పథకం పొందాలంటే భూమి సాగు ఉండాల్సి ఉంటుంది. సాగులో లేని భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది.

సాగు యోగ్యత లేని భూములకు రైతు భరోసా స్కీమ్‌లో సాయం అందించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద.. ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సాగు చేసే ఎన్ని ఎకరాలకైనా రైతు భరోసా ఇస్తామని తెలిపారు. అయితే సాగు చేయని భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని కలెక్టర్లను ఆదేశించింది.

సాగు చేయని వాటిని ఎలా గుర్తిస్తారు..? 

  1. రైతు భరోసా పథకం కింద సాగు చేసే ప్రతి భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.12 సాయం అందించనుంది.
  2. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, అంటే రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదని గుర్తించుకోండి.
  3. వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలకు సంబంధించి.. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరిస్తారు.
  4. సాగు యోగ్యత లేని భూములను గుర్తించేందుకు ఫీల్డ్​ వెరిఫికేషన్​ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తారు. ఈ బృందంలో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్ అధికారులు ఇందులో ఉంటారు. సాగు చేయని భూములను గుర్తిస్తారు.
  5. పంచాయతీ కార్యదర్శి, ఏవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫీల్డ్​ వెరిఫికేషన్ బృందం లీడర్స్​గా ఉంటారు. ఈ బృందంలో రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, ఫీల్డ్​ అసిస్టెంట్​, ఆర్ఏ, ఏఈవోలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్​ సారథ్యంలోని డీఏవోలు, ఎంపీడీవోలు తదితర ఉన్నతాధికారులు ఈ బృందాలను పర్యవేక్షిస్తాయి.
  6. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నాన్ అగ్రికల్చర్(వ్యవసాయేతర) భూములను గుర్తిస్తారు. సర్వే నెంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తారు. ఆర్వోఆర్, పట్టాదారు పాస్​పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు. భూ భారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్​ మ్యాప్, శాటిలైట్ మ్యాప్​ల ఆధారంగా పరిశీలిస్తారు. అన్నింటిని బేరీజు వేసి వ్యవసాయ యోగ్యంకాని భూముల జాబితాను రూపొందిస్తారు.
  7. అధికారులు రూపొందించే జాబితాలు తప్పనిసరిగా గ్రామ సభల ముందు పెడుతారు. ఇందులో ఆయా భూముల వివరాలను ప్రదర్శిస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా పరిశీలిస్తారు. ఈ మొత్తం వివరాల సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామ సభ ఆమోదముద్ర వేస్తుంది.
  8. గ్రామాల వారీగా జాబితాలను గుర్తించి.. వ్యవసాయ యోగ్యంకాని భూముల పట్టికను ఫైనల్ చేస్తారు. ఈ భూములకు రైతు భరోసా అందించరని గుర్తించుకోండి.
  9. ఈ క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియ జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. జవరి 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి జనవరి 26 నుంచి రైతు భరోసా స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి