AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..

Milk Storage Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వంటింట్లో గృహిణులకు కొత్త టెన్షన్ మొదలవుతుంది. బయట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాలు కొన్న కొద్దిసేపటికే విరిగిపోవడం లేదా వాసన రావడం జరుగుతుంటుంది. అసలే పాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, పాలు వృథా కాకుండా ఉండాలంటే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తప్పనిసరి. ఆ చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Apr 25, 2026 | 3:36 PM

Share
ఫ్రిజ్‌లో పెట్టేముందు ఈ పని తప్పనిసరి: చాలామంది పాల ప్యాకెట్లు తెచ్చిన వెంటనే అలాగే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ ఎండకాలంలో ఇది సరైన పద్ధతి కాదు. పాలు తెచ్చిన వెంటనే వాటిని శుభ్రమైన పాత్రలోకి మార్చి, బాగా మరిగించాలి. పాలను మరిగించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ తర్వాత పాలు పూర్తిగా చల్లారిన తర్వాతే ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి.

1 / 5

ఫ్రిజ్ డోర్ దగ్గర పాలు పెడుతున్నారా?: సాధారణంగా మనం పాలు లేదా ఇతర పానీయాల డబ్బాలను ఫ్రిజ్ తలుపు వైపు ఉన్న అరల్లో పెడుతుంటాం. కానీ ఇది పాలకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఫ్రిజ్ తెరిచిన ప్రతిసారీ బయట వేడి గాలి తగిలి ఉష్ణోగ్రత మారేది అక్కడే. కాబట్టి పాలను ఎప్పుడూ ఫ్రిజ్ లోపలి వైపు ఉండే అరల్లో ఉంచాలి. అక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.

2 / 5
రెండుసార్లు మరిగించడం మేలు: సాధారణ రోజుల్లో ఒకసారి మరిగిస్తే సరిపోతుంది కానీ, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఉదయం మరిగించిన పాలు రాత్రికి పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే సాయంత్రం వేళ పాలను మరోసారి వేడి చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మరుసటి రోజు ఉదయం వరకు పాలు తాజాగా ఉంటాయి.

3 / 5
ఫ్రిజ్ లేని వారు ఇలా చేయండి: ఒకవేళ మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేకపోయినా, లేదా కరెంటు కోత ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందక్కర్లేదు. ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీటిని తీసుకుని, పాల గిన్నెను అందులో ఉంచండి. నీటి చల్లదనానికి పాలు త్వరగా పాడవ్వవు. మధ్యమధ్యలో ఆ నీటిని మారుస్తూ ఉంటే పాలు రోజంతా నిల్వ ఉంటాయి.

4 / 5
పాత్రల విషయంలో జాగ్రత్త: పాలు మరిగించడానికి ఉపయోగించే గిన్నెలు అత్యంత శుభ్రంగా ఉండాలి. పాత్రలో కొంచెం పాత పాలు ఉన్నా లేదా సరిగ్గా కడగకపోయినా తాజా పాలు వెంటనే విరిగిపోతాయి. పాలు మరిగించే ముందు పాత్రను ఒకసారి చల్లటి నీటితో కడిగితే, పాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి.

5 / 5
Follow Us
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్

Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..

పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..

ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ

వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?

అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం

ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే

ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!

అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్