మీ కాఫీని సూపర్ హెల్తీగా మార్చే సీక్రెట్ ఇదే.. ఈ రెండు కలిపితే డబుల్ బెనిఫిట్స్
04 June 2026
TV9 Telugu
TV9 Telugu
ఉదయం నిద్రలేచిన వెంటనే చాలామందికి గుర్తొచ్చేది ఒక వేడి కప్పు కాఫీ. కొందరికి అది రోజును ఉత్సాహంగా ప్రారంభించే అలవాటు అయితే, మరికొందరికి పనిబారిన మధ్యలో కాసేపు రిలాక్స్ అయ్యే మార్గం అని చెప్పవచ్చు
TV9 Telugu
రుచి, సువాసనతోపాటు కాఫీలో సహజంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి
TV9 Telugu
అయితే కొన్ని పోషక విలువలు కలిగిన పదార్థాలను కాఫీలో కలపడం ద్వారా దాని ఆరోగ్య ప్రయోజనాలను మరింత పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
కాఫీలో కొద్దిపాటి కోకో పౌడర్ లేదా ముడి కొకొవా కలపడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కోకోలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
అలాగే ఇందులోని పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
దీంతో కాఫీ రుచికి కొత్తదనం రావడమే కాకుండా అదనపు పోషకాలు కూడా అందుతాయి. ఇటీవలి కాలంలో కాఫీలో ఏ2 నెయ్యి కలిపి తాగడం కూడా ప్రాచుర్యం పొందుతోంది
TV9 Telugu
ఒక టీస్పూన్ ఏ2 నెయ్యిని కాఫీలో కలపడం ద్వారా జీర్ణవ్యవస్థకు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది
TV9 Telugu
ఇది జీర్ణనాళంలో వాపులను తగ్గించడంలో, పేగుల అంతర్గత పొరను ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది