అడవి పంది అత్యంత ప్రమాదకర జంతువు..! పర్యావరణానికి భారీ నష్టాన్ని కలిగిస్తోంది.. ఎలాగో తెలుసుకోండి..

Wild Boar : క్వీన్స్‌లాండ్, కాన్‌బెర్రా, ఆస్ట్రేలియాలోని కాంటర్బరీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు అడవి పందుల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. పరిశోధకుల

అడవి పంది అత్యంత ప్రమాదకర జంతువు..! పర్యావరణానికి భారీ నష్టాన్ని కలిగిస్తోంది..  ఎలాగో తెలుసుకోండి..
Wild Boar 1
uppula Raju

|

Jul 21, 2021 | 3:01 PM

Wild Boar : క్వీన్స్‌లాండ్, కాన్‌బెర్రా, ఆస్ట్రేలియాలోని కాంటర్బరీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు అడవి పందుల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. అడవి పందులు భూమిపై అత్యంత హానికరమైన జాతులలో ఒకటిగా గుర్తించారు. ఇవి వ్యవసాయం, స్థానిక వన్యప్రాణులకు హాని కలిగిస్తాయని తెలిపారు. అడవి పందులు ట్రాక్టర్ మాదిరి పొలాన్ని దున్నుతున్నట్లుగా మట్టిని పెద్ద ఎత్తున తోడేస్తాయని అన్నారు.

అడవి పందుల ద్వారా తవ్విన ప్రాంతాలను తైవాన్‌లో గుర్తించామని వీటి ద్వారా ప్రతి సంవత్సరం 4.9 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను విడుదల అవుతుందన్నారు. ఇది ఒక మిలియన్ కార్ల ఉద్గారాలకు సమానంగా ఉంటుందన్నారు. వాస్తవానికి భూమిలోని కార్బన్‌ ఎక్కువ భాగం మట్టిలో నిల్వ చేసి ఉంటుంది. అడవిపందులు తవ్వడం వల్ల అందులోని కర్భన ఉద్గారాలు వాతావరణంపై ప్రభావం చూపుతున్నాయన్నారు. అడవి పందులు ఐరోపా, ఆసియా అంతటా ఉన్నాయి ఒక అంటార్కిటికా మినహాయించి ప్రతి ఖండంలో నివసిస్తున్నాయి. ఇవి భూ గ్రహం మీద అత్యంత ప్రమాదకరమైన క్షీరదాలలో ఒకటిగా నిలిచాయి. ఒక్క ఆస్ట్రేలియాలోనే మూడు మిలియన్ల అడవి పందులు నివసిస్తున్నాయని అంచనా.

ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం 100 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల పంటలు, పచ్చిక బయళ్లను అడవి పందులు నాశనం చేస్తాయని అంచనా వేశారు. USలో వీటి ప్రభావం 12 శాతం ఉంది. 54 దేశాలలో 672 జంతు, మొక్కల జాతులకు అడవి పందులు ప్రత్యక్ష ముప్పుగా పరిణమించాయని పేర్కొన్నారు. ఇందులో ఆస్ట్రేలియన్ గ్రౌండ్ కప్పలు, చెట్ల కప్పలు, అనేక ఆర్చిడ్ జాతులు ఉన్నాయి. పందులు వాటి ఆవాసాలను నాశనం చేసి మరీ వేటాడతాయి. రాబోయే దశాబ్దాల్లో వారి భౌగోళిక పరిధి విస్తరిస్తుందని, ఆహార భద్రత మరియు జీవవైవిధ్యానికి ముప్పు కలిగించే సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

American Gold Car: ఇది చూసి నేర్చుకోండి.. డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో.. నెటిజన్లకు పాఠం నేర్పించిన బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్ మహీంద్ర

UP Ex CM kalyan singh: ఆందోళనకరంగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స

Lose Weight Fast: పాలతో వేగంగా బరువు తగ్గొచ్చు.. అదెలాగంటే.. ఆసక్తికర విషయాలు మీకోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu