UP Ex CM kalyan singh: ఆందోళనకరంగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స

యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని లక్నోలోని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 89 ఏళ్ళ కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం విషమించడంతో ఆయనను నిన్న సాయంత్రం నుంచి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సంజయ్ గాంధీ పీజీ మెడికల్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు...

UP Ex CM kalyan singh: ఆందోళనకరంగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స
Ex Up Cm Kalyan Singh S Health Critical Says Doctors
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 21, 2021 | 2:36 PM

యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని లక్నోలోని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 89 ఏళ్ళ కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం విషమించడంతో ఆయనను నిన్న సాయంత్రం నుంచి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సంజయ్ గాంధీ పీజీ మెడికల్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. రక్త పరీక్షల్లో ఆయన మూత్రానికి సంబంధించి క్రియాటినైన్ లెవెల్స్ పెరిగాయని, ఇంకా శరీర సంబంధ రుగ్మతలు తలెత్తాయని వారు చెప్పారు. ఇంతకు ముందు ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నేతలు పరామర్శించారు.

రాజస్థాన్ మాజీ గవర్నర్ కూడా అయిన కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని మొత్తం 8 మంది డాక్టర్లతో కూడిన ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ నెల 4 నుంచి ఆయన రాంమనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ మెరుగైన ట్రీట్ మెంట్ కోసం లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ మెడికల్ ఆసుపత్రిలో చేర్చారు. నిన్న మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటూ వచ్చిందని, అయితే హఠాత్తుగా దిగజారిందని డాక్టర్లు తెలిపారు. ఆయన హెల్త్ కి సంబంధించి బులెటిన్లు విడుదల చేస్తుంటామని వారు పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : బె ‘జోష్’…అంతరిక్షయాత్ర దిగ్విజయం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 కరోనాతో పాటే ‘నోరో వైరస్’.. కళవరపెడుతున్న కొత్త టెన్షన్…ఇప్పటికే నమోదైన పలు కేసులు..:Norovirus Tension Live Video.

 ఉదయం ఉమ్మిని రాసుకుంటా..అందుకే అందంగా ఉన్నా..బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన మిల్కి తమన్నా..:Tamannaah Beauty Video.

 తండ్రిని…ఏం కాక పడుతుంది ఛార్మి !ఎందుకు అనుకుంటున్నారా..?చివరికి ఎం అయ్యింది..:Charmy Kaur Video.