AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sero Survey: రెండు టీకాలు తీసుకున్న తరువాతే ప్రయాణాలు చేయండి..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన!

Sero Survey: కరోనాకు వ్యతిరేకంగా 67.6% మంది భారతీయులు ప్రతిరోధకాలను(యాంటీబాడీస్) అభివృద్ధి చేసుకోగలిగారు.  అంటే సగానికి పైగా భారతీయులు కరోనాతో పోరాడగలిగారు.

Sero Survey: రెండు టీకాలు తీసుకున్న తరువాతే ప్రయాణాలు చేయండి..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన!
Sero Survey
KVD Varma
|

Updated on: Jul 21, 2021 | 3:09 PM

Share

Sero Survey: కరోనాకు వ్యతిరేకంగా 67.6% మంది భారతీయులు ప్రతిరోధకాలను(యాంటీబాడీస్) అభివృద్ధి చేసుకోగలిగారు.  అంటే సగానికి పైగా భారతీయులు కరోనాతో పోరాడగలిగారు. ప్రభుత్వ నాలుగవ సెరో సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైంది. కరోనా  మూడవ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణాలకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది. పూర్తి టీకా లేకుండా ప్రయాణించకుండా ఉండాల్సిన అవసరం ఉందని ఇందులో పేర్కొంది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఏడు విషయాలను స్పష్టం చేసింది.

1. అలసత్వానికి చోటు లేదు: సెరో-సర్వే కరోనాకు వ్యతిరేకంగా ఆశాకిరణాన్ని చూపించింది, కాని ప్రస్తుతం ఏ విధమైన అలసత్వానికి అవకాశం ఇవ్వలేము. ఎందుకంటె  32% మంది ఇప్పటికీ కరోనా నుండి సురక్షితంగా లేరు.

2. జిల్లా వారీగా పరిస్థితిపై ఎటువంటి ప్రకటన లేదు: స్థానిక లేదా జిల్లా స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. సెరో-సర్వేలో, దేశం యొక్క మొత్తం పరిస్థితిని పరిశీలించారు. అయితే జిల్లాల వారీగా పరిస్థితి పై వివరాలను ఇవ్వలేదు.

3. రాష్ట్ర-స్థాయి చర్య అవసరం: కరోనా నుండి జనాభాలో ఎంత శాతం ప్రజలు రక్షణ పొందగలిగారో  తెలుసుకోవడానికి రాష్ట్రాలు స్థానిక సెరో-సర్వేలను కొనసాగించాలి.

4. మూడవ వేవ్ రాక: భవిష్యత్తులో సంక్రమణ వేవ్ లు రావచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవానికి, కొన్ని రాష్ట్రాల్లో, కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి అధిక స్థాయిలో కనబడింది. ఇదే సమయంలో కొన్ని ప్రదేశాలలో ఇది చాలా తక్కువగా ఉంది.

5. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి: జూలై మొదటి వారం నుండి , అనేక రాష్ట్రాలు పరిమితులను సడలించడం ప్రారంభించాయి. ఈ కారణంగా, పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లు రద్దీగా ఉన్నాయి., దీని వలన సంక్రమణ ప్రమాదం పెరుగుతోంది. ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

6. సమావేశాలకు దూరంగా ఉండండి: చాలా రాష్ట్రాలు సమావేశాల కోసం ఆంక్షలను సడలించాయి, అయితే ప్రస్తుతానికి దీనిని నివారించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వం త్వాలు ఇటీవల కన్వర్ యాత్రను రద్దు చేశాయి.

7. పూర్తి టీకా తర్వాత ప్రయాణం: పూర్తి టీకాలు వేసిన తర్వాతే ప్రయాణం చేయాలని ప్రభుత్వం తెలిపింది. అంటే, నిర్ణీత విరామం తర్వాత టీకా రెండు మోతాదులను తీసుకున్న వారు మాత్రమే ప్రయాణాలు చేయాలి.

సెరో-సర్వే వెల్లడించిన నాలుగు ముఖ్య వివరాలు..

1. 6 నుండి 9 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 57.2% అదేవిధంగా, 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 61.6% మందిలో ప్రతిరోధకాలు కనుగొనబడ్డాయి.

2. 18 నుండి 44 సంవత్సరాల వయస్సులో 66.7%, 45 నుండి 60 సంవత్సరాల వయస్సులో 77.6%, 60 సంవత్సరాల కంటే 76.7% లో ప్రతిరోధకాలు కనుగొనబడ్డాయి.

3. కోవిడ్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు 69.2% స్త్రీలలో,  65.8% పురుషులలో కనుగొన్నారు.

4. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 69.6% , గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 66.7% మందిలో ప్రతిరోధకాలు ఉన్నాయి.

సెరో-సర్వేలో, ప్రాథమిక పాఠశాలలను తెరవడానికి సూచన:

పెద్ద సంఖ్యలో పిల్లలను కూడా ఈ సర్వేలో చేర్చారు. పాఠశాలలను ప్రారంభించే ప్రశ్నపై, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ పాఠశాలలను తెరవవచ్చు, ఎందుకంటే,చిన్నపిల్లలలో సంక్రమణ ప్రమాదం పెద్దల కంటే తక్కువగా ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలను ప్రారంభ దశలో ప్రారంభించాలని, ఆ తరువాత మాధ్యమిక పాఠశాలలను ప్రారంభించాలని ఆయన సూచించారు.

ఉపాధ్యాయులు, సిబ్బందికి టీకాలు వేయాలి..

భార్గవ మాట్లాడుతూ, చిన్నపిల్లలు పెద్దలతో పోలిస్తే చాలా సులభంగా  వైరస్ ను ఎదుర్కోగలుగుతారు. చిన్నపిల్లల ఊ పిరితిత్తులలో వైరస్ దాడి చేసే చోట తక్కువ గ్రాహకాలు ఉంటాయి. దీనితో పాటు, పాఠశాలలు తెరిస్తే, ఉపాధ్యాయుల నుండి సహాయక సిబ్బందికి పూర్తిగా టీకాలు వేయాలని ఆయన సూచించారు. అలాగే, కరోనా నియమాలను పూర్తిగా పాటించాలని ఆయన చెప్పారు.

Also Read:  COVID-19: పాదయాత్రలు, బస్సు యాత్రలు కరోనా క్యారియర్లుగా మరనున్నాయా.. దుమారం రేపుతున్న ఆరోగ్య శాఖ హెచ్చరికలు..!

India Covid Deaths: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం .. వాస్తవ మృతుల సంఖ్య ఎంతంటే..? సర్వేలో షాకింగ్ విషయాలు