India Covid Deaths: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం .. వాస్తవ మృతుల సంఖ్య ఎంతంటే..? సర్వేలో షాకింగ్ విషయాలు
Covid-19 Deaths in India: దేశంలో కరోనా మహమ్మారి గత ఏడాదిన్నర కాలంగా విలయతాండవం చేస్తోంది. 2020 మార్చిలో మొదలైన కరోనా కల్లోలం..ఇంకా కొనసాగుతూనే ఉంది.
India Covid-19 News: దేశంలో కరోనా మహమ్మారి గత ఏడాదిన్నర కాలంగా విలయతాండవం చేస్తోంది. 2020 మార్చిలో మొదలైన కరోనా కల్లోలం..ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖంపడుతుండగా…అప్పుడే థర్డ్ వేవ్ భయాలు జనాలను వణికిస్తోంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా ఎత్తివేయడంతో మరో నెల, నెలన్నరలోనే థర్డ్ వేవ్ మొదలుకావచ్చని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ అధికారిక గణాంకాల మేరకు ఇప్పటి వరకు దేశంలో 4,18,480 మంది కరోనా వైరస్ కాటుకు బలయ్యారు. అయితే పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు వెల్లడించిన కరోనా మరణాల సంఖ్య పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ మరణాల సంఖ్య ప్రభుత్వ అధికారిక లెక్కల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని మీడియా వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. ఇదే విషయమై అమెరికాకు చెందిన ఓ సంస్థ భారత్‌లో సర్వే నిర్వహించింది. దేశంలో కరోనా కారణంగా సంభవించిన వాస్తవ మరణాల సంఖ్యను లెక్కగట్టే ప్రయత్నం చేసింది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ అనే సదరు సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కల కంటే 10 రెట్లు ఎక్కువగా దేశంలో కరోనా మరణాలు సంభవించి ఉండొచ్చని ఆ సంస్థ తన సర్వే నివేదికలో అంచనావేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం బుధవారంనాటి వరకు దేశంలో 4.18 లక్షల కరోనా మరణాలు నమోదుకాగా… వాస్తవానికి ఈ సంఖ్య 34 లక్షల నుంచి 47 లక్షల వరకు ఉండొచ్చని తమ అధ్యయనంలో తేలినట్లు సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ వెల్లడించింది. అంటే ప్రభుత్వం చెబుతున్న కరోనా మరణాల కంటే 10 రెట్లు ఎక్కువగా మరణాలు సంభవించినట్లు ఆ సంస్థ అంచనావేసింది. తాము అంచనావేస్తున్నట్లు 34 లక్షల నుంచి 47 లక్షల మంది మృతుల్లో…కేవలం కరోనా వైరస్ కారణంగానే వారు మృతి చెందినట్లు భావించడం ఆ సంస్థ తెలిపింది. అయితే కరోనా మరణాలకు సంబంధించి భారత ప్రభుత్వం చెబుతున్న సంఖ్య కంటే చాలా ఎక్కువగా మరణాలు సంభవించినట్లు వెల్లడించింది.
భారత్‌లో మరణాలకు సంబంధించి సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సర్వే నివేదికలోని అంశాలను బీబీసీ కూడా ప్రచురించింది. దేశంలో సగం జనాభా కలిగిన ఏడు రాష్ట్రాల్లో నమోదైన మరణాలను ప్రధానంగా తన అధ్యయనంలో పరిగణలోకి తీసుకుంది. అలాగే గత నాలుగు మాసాల్లో కుటుంబ సభ్యులను ఎవరినైనా కోల్పోయారా? అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ సర్వేలో భాగంగా 8.68 లక్షల మంది వ్యక్తులు, 1.77 లక్షల కుటుంబాల అభిప్రాయాలను సేకరించారు. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్‌లోనే ఎక్కువ మరణాలు సంభవించాయన్న అంచనాలతో ఆ సర్వే విబేధించింది. ఫస్ట్ వేవ్‌లో కూడా భారీ సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయని అంచనావేసింది.
బ్రిటన్‌ను వణికిస్తున్న నోరా వైరస్..Watch Video
Also Read..
Mangli Song Controversy: బోనాల సాంగ్ వివాదంపై తొలిసారి స్పందించిన సింగర్ మంగ్లీ.. ఆమె మాటల్లోనే..
Covid News: కరోనా ముప్పు అప్పుడే పోలేదు.. దేశంలో మూడింట రెండొంతుల మందికి యాంటీబాడీస్.. ఐసీఎంఆర్