New Credit Card: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్ కావాలా? ఇలా చేయండి

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. అయితే, వీటిపై చేసే ఖర్చు తడిసిమోపెడవుతోందని భావిస్తున్నారా! ఇలాంటి లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ కావాలని కోరుకుంటున్నారా?

New Credit Card: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్ కావాలా? ఇలా చేయండి
Icici Hpcl Credit Card
Follow us
Venkata Chari

|

Updated on: Jul 21, 2021 | 12:34 PM

New Credit Card: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. అయితే, వీటిపై చేసే ఖర్చు తడిసిమోపెడవుతోందని భావిస్తున్నారా! ఇలాంటి లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ కావాలని కోరుకుంటున్నారా? అయితే మీకోసం ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా కోబ్రాండెడ్ క్రెటిడ్ కార్డును విడుదల చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును సరికొత్త ఫీచర్లతో ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్‌ల నుంచి రీఛార్జ్ వరకు 24 గంటల రోడ్‌సైడ్ సహాయం వరకు, ఈ కార్డు వినియోగదారులు పొందవచ్చు. ఈ కార్డ్ వినియోగదారులకు రోజువారీ విద్యుత్, మొబైల్, బిగ్ బజార్, డీ-మార్ట్ వంటి డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, ఇ-కామర్స్ పోర్టల్‌లలో చేసే ఖర్చుపై అనేక బహుమతులతోపాటు ప్రయోజనాలను అందించనుంది. కొత్తగా ఆవిష్కరించిన ఈ క్రెడిట్ కార్డుపై ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ సుదీప్తా రాయ్ మాట్లాడుతూ.. “సాధారణంగా, ఇలాంటి క్రెడిట్ కార్డులు ఒకే కేటగిరీలో ఖర్చు చేయడంపై అధిక ప్రయోజనాలను అందిస్తాయి. కానీ, ఈ కార్డుకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేదు. చేసే ప్రతీ ఖర్చుపై క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు. ఈ కార్డు పొదుపులో ‘సూపర్ స్టార్’ గా పనిచేయనుందని” ఆయన తెలిపారు.

కొత్త ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను పరిశీలిద్దాం..

1) హెచ్‌పీసీఎల్ రిటైల్ అవుట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇందులో 4శాతం క్యాష్‌బ్యాక్, 1శాతం సర్ చార్జ్ మనిహాయింపు ఉంటుంది. 2) హెచ్‌పీసీఎల్ ‘హెచ్‌పీ పే’ తో పెట్రోల్, డీజిల్ కోనుగోలు చేస్తే.. పేబ్యాక్ రివార్డ్ పాయింట్లుగా అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. పెట్రోల్, డీజిల్ కొనుగోలు కోసం ఖర్చు చేసిన మొత్తంలో కనీసం 1.5 శాతం రివార్డ్ పాయింట్లు అందనున్నాయి. 3) విద్యుత్, మొబైల్ ఖర్చులపై 5శాతం పేబ్యాక్ రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. అలాగే బిగ్ బజార్, డీ-మార్ట్ వంటి డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో షాపింగ్ చేసినా పేబ్యాక్ రివార్డ్ పాయింట్లు అందుతాయి. 4) స్థానిక దుకాణాలలో షాపింగ్‌తోపాటు ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఇ-కామర్స్ పోర్టల్‌తో సహా అన్ని ఇతర ఖర్చులకు పేబ్యాక్ రివార్డు పాయింట్లు అందనున్నాయి. ఇందులో రూ .100 లకు 2 పేబ్యాక్ పాయింట్లు అందనున్నాయి. 5) వినియోగదారులకు జాయినింగ్ బెనిఫిట్‌గా 2,000 పేబ్యాక్ పాయింట్లు లభిస్తాయి. కార్డు యాక్టివేట్ అయ్యాక పేబ్యాక్ కార్డుతో ఆటోమెటిగ్‌గా లింక్ అవుతుంది. 6) కార్డును ఉపయోగించి రూ .1000 లేదా అంతకంటే ఎక్కువగా మొత్తంలో మొదటి లావాదేవీ పూర్తి చేస్తే ‘హెచ్‌పీ పే’ యాప్ వాలెట్‌లో రూ. 100 రూపాయల క్యాష్‌బ్యాక్ అందుతుంది.

ఇవే కాకుండా, వినియోగదారులకు కార్డుతో కాంప్లిమెంటరీ 24 × 7 రోడ్‌సైడ్ హెల్స్ కూడా లభిస్తుంది. ఇక వార్షిక రుసుముల విషయానికి వస్తే.. ఏడాదిలో రూ.1,50,000 రూపాయలు ఖర్చు చేస్తే ఎటువంటి ఛార్జీలు ఉండవు. కో-బ్రాండెడ్ ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డుతో పాటు, వినియోగదారులకు కాంప్లిమెంటరీగా దేశీయ విమానాశ్రయం లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. బుక్‌మైషో, ఐనాక్స్‌లో మూవీ టికెట్ బుకింగ్‌లపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్యులినరీ ట్రీట్స్ ప్రోగ్రాంతో డైనింగ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఐసీఐసీఐ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఐమొబైల్ పే ద్వారా ఎవరైనా ‘ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పూర్తయ్యాక వందశాతం కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ పద్ధతిలో డిజిటల్ కార్డును పొందుతారు. భౌతిక కార్డు కూడా అందుబాటులో ఉంటుంది. కార్డు యాక్టివేట్ అయ్యాక లావాదేవీల పరిమితిని ఐమొబైల్ పే యాప్‌లో సెట్ చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ ప్రస్తుత కార్డును ఐమొబైల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ‘ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్’కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది.

Also Read:

Smart Saving Account: ఈ బ్యాంక్ అకౌంట్‌తో అధిక వడ్డీ.. తీసుకోవడం కూడా చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

IT Returns:పెరిగిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు.. గత ఐదేళ్ళలో ఎంత మంది రిటర్న్స్ దాఖలు చేశారంటే..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్