AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Returns:పెరిగిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు.. గత ఐదేళ్ళలో ఎంత మంది రిటర్న్స్ దాఖలు చేశారంటే..

IT Returns: కరోనా కాలంలో ప్రజల ఆదాయం ప్రభావితమై ఉండవచ్చు. కాని, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేసే వారి సంఖ్య పెరిగింది.

IT Returns:పెరిగిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు.. గత ఐదేళ్ళలో ఎంత మంది రిటర్న్స్ దాఖలు చేశారంటే..
It Returns
KVD Varma
|

Updated on: Jul 20, 2021 | 10:02 PM

Share

IT Returns: కరోనా కాలంలో ప్రజల ఆదాయం ప్రభావితమై ఉండవచ్చు. కాని, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేసే వారి సంఖ్య పెరిగింది. 2021 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 7.38 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2019-20లో 6.78 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు చేశారు.

దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలర్ల సంఖ్య పెరుగుతోంది. గత 5 సంవత్సరాల కాలంలో దాఖలు అయిన రిటర్న్స్ పరిస్థితిని గమనిస్తే.. ఈ సంవత్సరం ఐటిఆర్ ఫైల్ చేసిన వారి  సంఖ్య సుమారు 32% పెరిగింది. 2016-17లో 5.61 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు చేయగా, 2020-21లో 7.38 కోట్లు దాఖలు చేశారు.

ఏ సంవత్సరంలో ఎన్ని రిటర్న్స్ ఫైల్ అయ్యాయి అంటే.. 

    సంవత్సరం                            ఎన్ని ఐటీఆర్‌లు 

  • 2020-21                                         7.38 కోట్లు
  • 2019-20                                         6.78 కోట్లు
  • 2018-19                                         6.74 కోట్లు
  • 2017-18                                         6.92 కోట్లు
  • 2016-17                                          5.61 కోట్లు

కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌లో చాలా సమస్యలు..

ప్రభుత్వం జూన్ 7 న కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌ను ప్రారంభించింది. అప్పటి నుండి ఇది చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. డజనుకు పైగా సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దేశంలో ఒక నెలకు పైగా ఆదాయపు పన్ను, టిడిఎస్ రిటర్న్స్ దాఖలు చేయడం లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను సెప్టెంబర్ 30 లోగా దాఖలు చేయాలి. అంతకుముందు, జూలై 31 దీనికి చివరి తేదీ అయితే సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడింది.

రిటర్న్ ఫైల్ చేసే వారి  సంఖ్య ఎందుకు పెరుగుతోంది?

ఈ రోజుల్లో ప్రజలు ఐటిఆర్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.   వ్యక్తుల  ఆదాయానికి రుజువు ఐటీఆర్. ఒకవేళ మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఐటిఆర్ దాఖలు చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, మీరు వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు మిమ్మల్ని ఆదాయపు పన్ను రిటర్న్ కోసం అడగవచ్చు. అదేవిధంగా ఐటీఆర్ చిరునామా రుజువుగా కూడా పనికివస్తుంది.  ఇలాంటి అనేక ప్రయోజనాల కారణంగా, ప్రజలు ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్నులను ఎక్కువగా దాఖలు చేస్తున్నారు.

Also Read: Jeff Bezos Return: జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్..

Leopard : మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకి పోస్ట్ మార్టమ్ పూర్తి.. అయినా కొలిక్కిరాని మిస్టరీ.!