Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Sale: పాటలను లోడ్ చేసి వస్తున్నతొలి నెక్‌బ్యాండ్.. అమెజాన్ లో అమ్మకానికి.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే..

Amazon Sale: చాలామందికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూనే ఉంటారు. ఎంతసేపు అలా విన్నా వారికి విసుగురాదు.

Amazon Sale: పాటలను లోడ్ చేసి వస్తున్నతొలి నెక్‌బ్యాండ్.. అమెజాన్ లో అమ్మకానికి.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే..
Amazon Sale
Follow us
KVD Varma

|

Updated on: Jul 20, 2021 | 9:05 PM

Amazon Sale: చాలామందికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూనే ఉంటారు. ఎంతసేపు అలా విన్నా వారికి విసుగురాదు. మంచి ఇయర్ ఫోన్స్ కోసం వీరు ఎప్పుడూ వెతుకులాడుతారు. మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త రకం ఇయర్ ఫోన్స్ కోసం వీరు చూస్తారు. అయితే, ఇయర్ ఫోన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా బ్లూటూత్ సహాయంతో లేదా వైర్ తో మొబైల్ కు అనుసంధానం అయి పని చేస్తాయి. ఇటీవల కాలంలో బ్లూటూత్ తో పనిచేసే నెక్‌బ్యాండ్ లు బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి. వీటితో సంగీతం వినాలనుకున్నా మొబైల్ ఫోన్ అందుబాటులో ఉండాల్సిందే. అదే మొబైల్ లేకుండా పాటలు నెక్‌బ్యాండ్ తో వైన్ అవకాశం వస్తే.. సంగీత ప్రియులు ఎగిరి గంతేస్తారు.

ఇదిగో ఇప్పుడు అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త నెక్‌బ్యాండ్ అందిస్తోంది.  ఇది టార్బుల్ బ్రాండ్  ఉత్పత్తి. టార్బుల్ మ్యూజిక్‌మేట్ 500 నెక్‌బ్యాండ్  ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది  1001 పాటలను ముందుగానే లోడ్ చేసుకుని వస్తుంది. దీనిలో మీరు మొబైల్‌కు కనెక్ట్ చేయకుండా పాటలు వినవచ్చు. దీని ధర రూ .1,799. ఇది  ప్రపంచంలో మొట్టమొదటి ప్లే బ్యాక్నె సదుపాయం ఉన్న నెక్‌బ్యాండ్ బ్లూటూత్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

టార్బుల్ మ్యూజిక్ మేట్ 500 నెక్‌బ్యాండ్ ఇలా ఉంటుంది..

  • నెక్‌బ్యాండ్ లో ముందే లోడ్ చేసిన పాటలు సోనీ మ్యూజిక్ కంపెనీకి చెందినవి. దీనికి సంగీత సభ్యత్వం లేదా ఇంటర్నెట్ అవసరం లేదు.
  • దీన్ని 10 మీటర్ల దూరం నుండి మొబైల్ లేదా ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు.
  • గొప్ప 3D ఆడియో అనుభవాన్ని పొందుతుంది. ఇది వాటర్ ప్రూఫ్.
  • 10 నిమిషాల ఛార్జ్ 10 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది. పూర్తి ఛార్జీతో 35 గంటలు ఉంటుంది. ఇన్‌కమింగ్ కాల్‌ల కోసం వైబ్రేషన్‌తో హెచ్చరికలు.
  • వ్యాయామ క్రీడలు, వీడియో స్ట్రీమింగ్ మరియు గేమింగ్ కోసం దీనిని ఉపయోగించవచ్చు.
  • 1001 పాటల 6 ప్లేజాబితాలు ఉన్నాయి. రొమాంటిక్, సోల్ఫుల్ మెలోడీ, డౌన్ మెమరీ లేన్, పార్టీ హిట్స్, గజల్స్, డెవొషనల్స్ సాంగ్స్ విభాగం సహా మంచి వీనుల విందైన పాటలు దీనికి జత చేశారు.

Also Read: Christian Businessman: తన వ్యాపార విజయానికి గణేశుడు కారణం అంటూ.. రూ.2 కోట్లతో ఆలయం నిర్మించిన క్రిస్టియన్.. ఎక్కడంటే

Dakkili Temple Construction : అమ్మ చెప్పిన మాట కోసం ఆస్తులు అమ్మి మరీ గుడి కట్టాడు.. ఇప్పుడాయన పరిస్థితి ఎలా ఉందంటే..!

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!