Christian Businessman: తన వ్యాపార విజయానికి గణేశుడు కారణం అంటూ.. రూ.2 కోట్లతో ఆలయం నిర్మించిన క్రిస్టియన్.. ఎక్కడంటే
Christian Businessman:మతానికి విశ్వాసానికి సంబంధం లేదని ఇప్పటికే అనేక సంఘటనలు నిరూపించాయి. ఎంతోమంది విదేశీయులు కృష్ణుడిని పూజిస్తున్నారు.. తిరుమల బాలాజీని..
Christian Businessman:మతానికి విశ్వాసానికి సంబంధం లేదని ఇప్పటికే అనేక సంఘటనలు నిరూపించాయి. ఎంతోమంది విదేశీయులు కృష్ణుడిని పూజిస్తున్నారు.. తిరుమల బాలాజీని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ 78 ఏళ్ల క్రైస్తవ వ్యాపారవేత్త కొన్ని కోట్లు ఖర్చు పెట్టి.. విఘ్నాలకధిపతి గణేశుడి ఆలయాన్ని నిర్మించాడు. వివరాల్లోకి వెళ్తే..
గాబ్రియేల్ ఎఫ్ నజరేత్ అనే వ్యాపారి సిద్ధివినాయక భక్తుడు. సామాన్యుడిగా ఉన్న తనని ఈరోజు మంచి బిజినెస్ మెన్ గా చేసింది గణేశుడని అతని విశ్వాసం.. తన విజయం వెనుక సిద్ధివినాయక్ ఆశీస్సులు ఉన్నాయని గాబ్రియేల్ బలంగా నమ్ముతున్నాడు. దీంతో తన ఎదుగుదలకు కారణమైన గణేశుడికి ఆలయం నిర్మించాలనుకున్నాడు.. కర్ణాటక లోని ఉడిపికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామం లో గాబ్రియేల్ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం తనకు పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిందని.. అందుకనే ఆ భూమిలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గణేశుడికి ఆలయాన్ని నిర్మించానని గాబ్రియేల్ స్వయంగా తెలిపాడు.
గాబ్రియేల్ 10వ తరగతి పూర్తి చేసిన అనంతరం పని కోసం ముంబై కు చేరుకున్నాడు. ముంబై లో దాదాపు 55 ఏళ్ళు నివశించాడు.. మొదట్లో జీవనోపాధి కోసం కొన్ని ఏళ్ళు చిన్న చిన్న పనులు చేశాడు.. అనంతరం అచ్చులను తయారుచేసే కర్మాగారాన్ని ప్రారంభించాడు. అక్కడే గణేశుడి భక్తుడు అయ్యాడు. అయితే తన మతం క్రిస్టియానిటీ అని.. కానీ తనకు గణేశుడు అంటే పూర్తి నమ్మకం ఉందని చెబుతాడు.. ముంబై నుంచి కర్ణాటక 10 ఏళ్ల క్రితం తిరిగి వచ్చినప్పుడు ఒక ఆలయం నిర్మించాలని అనుకున్నట్లు తెలిపారు.
ఆ కల ఇప్పటి నెరవేరిందని.. గాబ్రియేల్ తన ఇంటి పక్కన గణేష్ ఆలయాన్ని సుమారు రెండు కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాడు., మందిరంలో పెద్ద గణేశుడి విగ్రహం ఏర్పాటు చేశారు.. ధూప దీప నైవేదం పెట్టడానికి పూజారిని నియామించి.. ఆయనకు ఆలయ సమీపంలో నివసించడానికి ఒక ఇల్లు కూడా నిర్మించి స్వామివారికి ఏ లోటు లేకుండా పూజాదికార్యక్రమాలను చేస్తున్నారు గాబ్రియేల్.