Bakrid 2021: ఇవి మామూలు మేకలు కాదు..వీటి ధర చెబితే నోరు వెళ్ళపెడతారు.ఈ మేకలు ఏమి తిని పెరిగాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!

Bakrid 2021: ముస్లింలకు పవిత్రమైన బక్రీద్ పండుగ కోసం అందరూ సిద్ధం అవుతున్నారు. బక్రీద్ పండుగ రోజు కోసం ముస్లిం సోదరులు మేకలను కొంటారు.

Bakrid 2021: ఇవి మామూలు మేకలు కాదు..వీటి ధర చెబితే నోరు వెళ్ళపెడతారు.ఈ మేకలు ఏమి తిని పెరిగాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!
Bakrid 2021
KVD Varma

|

Jul 20, 2021 | 10:03 PM

Bakrid 2021: ముస్లింలకు పవిత్రమైన బక్రీద్ పండుగ కోసం అందరూ సిద్ధం అవుతున్నారు. బక్రీద్ పండుగ రోజు కోసం ముస్లిం సోదరులు మేకలను కొంటారు. పండగ విందు కోసం అది ముఖ్యమైనది. సాధారణంగా మేకలు ఈ సమయంలో విపరీతమైన ధర పలుకుతాయి. కానీ, పండుగ వేడుకల కోసం తప్పనిసరిగా వాటిని కొనుగోలు చేస్తారు. ఈ సమయం లో సరైన మేకలు దొరకడం కూడా కష్టంగానే మారుతుంది.  ఇదిగో బక్రీద్ వేడుకల కోసం రెండు మేకలను లక్షలాది రూపాయలు వెచ్చించాడు ఒకాయన. ఈ ఖరీదైన మేకల కథ లక్నోలో చోటు చేసుకుంది. ఎక్కడైనా లక్షలు పెట్టి మేకలు కొంటారా అని అనుకోకండి.. ఈ వివరాలు వింటే మీరూ ఔరా అనుకుంటారు.  ఆసక్తిగొలిపే ఆ వివరాలు మీకోసం.

ఈద్ అల్-అధా లేదా బక్రిద్  వేడుకల కోసం ఉత్తర ప్రదేశ్ లక్నోలో ఒక జత మేకలకు అమన్  అనే వ్యక్తి రూ .4.5 లక్షలు ఖర్చు చేశారు. లక్నోలోని గోమతి నది సమీపంలో ఉన్న మార్కెట్లో మంగళవారం ఖరీదైన జత మేకలను ఈయన కొనుగోలు చేశారు. మేకలలో ఒకటి 170 కిలోల బరువు ఉంటుంది. మరొకటి బరువు 150 కిలోలు. ఇవి రెండేళ్ల వయసున్న మేకలు. వీటి  రోజువారీ ఆహారం సుమారు 600 రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో జీడిపప్పు, పిస్తా, బాదం, స్వీట్లు మరియు ఖరీదైన రసాలు ఉన్నాయి. పరిశుభ్రత పాటించడానికి వీటికి ప్రతిరోజూ స్నానం చేయిస్తారు. ఇంత సేవ చేసి పెంచిన మేకలు కాబట్టే ఆ ధర పలికింది. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంటుందని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటె బక్రీద్ వేడుకల సందర్భంగా లక్నోలోని కుడియా ఘాట్ లో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇక్కడ మేకల మర్కెట్ పూర్తి రద్దీగా మారిపోయింది. కోవిడ్ ప్రోటోకాల్ ఇక్కడ ఎవరూ పాటించడం కనిపించలేదు. చాలా మంది మేకల విక్రేతలు మాస్క్ లు ధరించలేదు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఇక్కడ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈ సంవత్సరం మార్కెట్ లో మేకలకు డిమాండ్ తక్కువ ఉందని అక్కడి ప్రజలు చెప్పారు. మార్కెట్ లో వస్తువులను విక్రయించడానికి వచ్చిన వ్యక్తులు కూడా వ్యాపారం సరిగా లేదని వాపోయారు. ప్రస్తుతం కనిపిస్తున్న రద్దీ చాలా తక్కువని వారు చెప్పుకొచ్చారు.  ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగను ముస్లిం సోదరులు  జూలై 21 న దేశంలో జరుపుకుంటారు. అయితే ఇది చంద్రుని చూడటం మీద ఆధారపడి ఉంటుంది.

Also Read: Christian Businessman: తన వ్యాపార విజయానికి గణేశుడు కారణం అంటూ.. రూ.2 కోట్లతో ఆలయం నిర్మించిన క్రిస్టియన్.. ఎక్కడంటే

Dakkili Temple Construction : అమ్మ చెప్పిన మాట కోసం ఆస్తులు అమ్మి మరీ గుడి కట్టాడు.. ఇప్పుడాయన పరిస్థితి ఎలా ఉందంటే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu