కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ భార్యకు నాన్-బెయిలబుల్ వారంట్ జారీ..దివ్యాంగులకు ఉద్దేశించిన నిధుల్లో గోల్ మాల్ !

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూసే ఖుర్షీద్ కి కోర్టు నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డా.జాకిర్ హుసేన్ మెమోరియల్ ట్రస్టుకు అందిన కేంద్ర గ్రాంట్లలో 71 లక్షలకు పైగా గోల్ మాల్

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ భార్యకు నాన్-బెయిలబుల్ వారంట్ జారీ..దివ్యాంగులకు ఉద్దేశించిన నిధుల్లో గోల్ మాల్ !
Non Available Warrant To Salman Khurshid Wife Louse Khurshid
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 21, 2021 | 1:07 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూసే ఖుర్షీద్ కి కోర్టు నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డా.జాకిర్ హుసేన్ మెమోరియల్ ట్రస్టుకు అందిన కేంద్ర గ్రాంట్లలో 71 లక్షలకు పైగా గోల్ మాల్ జరిగినట్టు ఇందుకు ఈమె బాధ్యురాలని కేసు నమోదైంది. ఈ కేసులో ఈమెతో బాటు ఈ ట్రస్ట్ సెక్రెటరీ అథర్ పరూకీకి కూడా నాన్ బెయిలబుల్ వారంటును చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ త్యాగి జారీ చేశారు. తిరిగి ఆగస్టు 16 న ఈ కేసు విచారణ జరగాలని నిర్ణయించారు. యూపీలోని 17 జిల్లాల్లో దివ్యాంగులకు ఉద్దేశించి వీల్ ఛైర్లు, మూడు చక్రాల సైకిళ్ళు, వినికిడి సాధనాలను పంపిణీ చేసేందుక కేంద్రం నుంచి ఈ ట్రస్టుకు 2010 మార్చి నెలలో 71.5 లక్షల నిధులు గ్రాంటుగా అందాయి. అప్పట్లో ఈమె ఈ ట్రస్టు డైరెక్టరుగా ఉన్నారు కానీ ఈ ట్రస్టుకు చెందిన ఆఫీసు బేరర్లు యూపీ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపులతో అవకతవకలకు పాల్పడ్డారని 2012 లో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు యూపీఏ హయాంలో సల్మాన్ ఖుర్షీద్ మంత్రిగా ఉన్నారు.

యూపీలోని డజను జిల్లాల్లో తాము దివ్యాంగులకు హెల్ప్ క్యాంప్ లను ఏర్పాటు చేసి వీల్ ఛైర్లు, మూడు చక్రాల సైకిళ్లను, ఇతర సాధనాలను పంపిణీ చేశామని ఈ ట్రస్ట్ చెప్పుకున్నప్పటికీ.. అదంతా కాగితాలపైనే ఉందని, వారికి ఈ విధమైన సహాయ శిబిరాలను నిర్వహించలేదని తెలియవచ్చింది. 2019 డిసెంబరులో ఈ కేసుకు సంబంధించి చార్జిషీటును పోలీసులు నమోదు చేశారు. ఇటీవల దాన్ని కోర్టుముందు ఉంచారు. .

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : బె ‘జోష్’…అంతరిక్షయాత్ర దిగ్విజయం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 కరోనాతో పాటే ‘నోరో వైరస్’.. కళవరపెడుతున్న కొత్త టెన్షన్…ఇప్పటికే నమోదైన పలు కేసులు..:Norovirus Tension Live Video.

 ఉదయం ఉమ్మిని రాసుకుంటా..అందుకే అందంగా ఉన్నా..బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన మిల్కి తమన్నా..:Tamannaah Beauty Video.

 తండ్రిని…ఏం కాక పడుతుంది ఛార్మి !ఎందుకు అనుకుంటున్నారా..?చివరికి ఎం అయ్యింది..:Charmy Kaur Video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu