ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ మరణాలు సంభవించలేదా ..? ప్రభుత్వంపై శివసేన నేత సంజయ్ రౌత్ ఫైర్
ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ మరణాలు సంభవించలేదంటూ ప్రభుత్వం ప్రకటించడాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్రంగా ఖండించారు. ఇలా ప్రకటించినందుకు ప్రభుత్వంపై కేసు పెట్టాలని, సర్కార్ అబద్దాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ రోగులు...
ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ మరణాలు సంభవించలేదంటూ ప్రభుత్వం ప్రకటించడాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్రంగా ఖండించారు. ఇలా ప్రకటించినందుకు ప్రభుత్వంపై కేసు పెట్టాలని, సర్కార్ అబద్దాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ రోగులు మృతి చెందలేదని రాష్ట్రాలు పేర్కొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ నిన్న రాజ్యసభలో వెల్లడించారు. ప్రాణవాయువు కొరత కారణంగా పలువురు రోగులు ఆస్పత్రుల్లోనూ, రోడ్లపైన కూడా మరణించినట్టు వార్తలు వచ్చాయని, ఇది నిజమేనా అని కాంగ్రెస్ నేత కె.సి. వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. థర్డ్ వేవ్ ముప్పు వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్పుడే ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. నిజానికి సెకండ్ కోవిడ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడు ఆక్సిజన్ కొరత గురించి రోగులు, వారి బంధువులు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు, తమ వద్ద ప్రాణవాయువు అయిపోయిందని వివిధ ఆసుపత్రులు కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి అత్యవసర ఎస్ఓ ఎస్ మెసేజులు పంపాయి. ఏప్రిల్ 23 న జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో 20మంది రోగులు, మే 1 న ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్ లో 12 మంది, కర్ణాటక లోని చామరాజనగర్ ఆసుపత్రిలో మే 2 న 24 మంది మృతి చెందారు.
ఆ నెలల్లో ఇంత ‘బీభత్సం’ జరిగినా ప్రాణవాయువు కొరత వల్ల కోవిడ్ రోగులు మృతి చెందలేదని మంత్రిగారు చెప్పడం హాస్యాస్పదమని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాగా పెగాసస్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత గానీ, సుప్రీంకోర్టు చేతగానీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : బె ‘జోష్’…అంతరిక్షయాత్ర దిగ్విజయం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
తండ్రిని…ఏం కాక పడుతుంది ఛార్మి !ఎందుకు అనుకుంటున్నారా..?చివరికి ఎం అయ్యింది..:Charmy Kaur Video.