COVID-19: పాదయాత్రలు, బస్సు యాత్రలు కరోనా క్యారియర్లుగా మరనున్నాయా.. దుమారం రేపుతున్న ఆరోగ్య శాఖ హెచ్చరికలు..!

పాదయాత్రలు, బస్సు యాత్రలు కరోనా క్యారియర్లుగా మరనున్నాయన్న తెలంగాణ ఆరోగ్య శాఖ హెచ్చరికలు.. తెలంగాణ రాజకీయ నేతల మధ్య దుమారం రేగుతోంది.

COVID-19: పాదయాత్రలు, బస్సు యాత్రలు కరోనా క్యారియర్లుగా మరనున్నాయా.. దుమారం రేపుతున్న ఆరోగ్య శాఖ హెచ్చరికలు..!
Telangana Health Department Tells Politicians To Ensure Covid 19 Precautions
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 21, 2021 | 1:01 PM

Telangana Health Department tells politicians: హుజూరాబాద్ ఉప ఎన్నికకు కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదా…రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా లేవంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కామెంట్స్ వెనుక మతలబు ఏంటి.. డిహెచ్ ఎవరిని హెచ్చరిస్తున్నారు. పాదయాత్రలు, బస్సు యాత్రలు కరోనా క్యారియర్లుగా మరనున్నాయన్న తెలంగాణ ఆరోగ్య శాఖ హెచ్చరికలు.. తెలంగాణ రాజకీయ నేతల మధ్య దుమారం రేగుతోంది.

కోవిడ్ నిబంధనలు సాధారణ ప్రజలకేనా- రాజకీయ పార్టీలకు నేతలకు వర్తించవా? ఒకవైపు ప్రపంచ ఆరోగ్య నిపుణులు.. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించినా పట్టింపు లేదా? థర్డ్ వేవ్ ముంపు ఉందని చెప్తున్నా- కేసులు పెరుగుతున్నా పార్టీలు మాత్రం పట్టింపు లేనట్లే వ్యవహరిస్తున్నాయి…

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆరెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కరోనా నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. సాధారణ ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉన్నా. ఇప్పుడే చైతన్య యాత్రలు ఎందుకు చేస్తున్నారని ఆరోగ్య శాఖ ప్రశ్నిస్తోంది. పాదయాత్రలు సభలు రాజకీయ నాయకుల హక్కు అయినా కనీస నిబంధనలు పాటించాలని కోరుతుంది. సభల్లో నాయకులు మాట్లాడుతుంటే పాల్గొన్న ప్రజలు కనీస బాధ్యతగా మాస్కులు కూడా పెట్టుకోవడం లేదంటూ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ముప్పు కచ్చితంగా ఉందని చెప్తున్నా పాలించే నాయకులే పాటించకపోవడం గమనార్హం. వందల వేల సంఖ్యల ప్రజలతో సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఆరోగ్య శాఖ పార్టీలను కోరుతూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నా.. వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లు అవలంబిస్తున్నాయి. ఇటీవల ముగిసిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముందు సెకండ్ వేవ్ ముప్పు ఉందని ఎంతచెప్పినా వినకుండా భారీ సంఖ్యలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. దాని ఫలితం కనీసం రాష్ట్రంలో ఆక్సిజన్ దొరకని స్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అధికార, విపక్షం అనే తేడా లేకుండా భారీ స్థాయిలో ప్రచారాలు, పాదయాత్రలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. దీంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల కరోనా నిబంధనల ఉల్లంఘన వల్ల ఆయా జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలు నలుగురు గుమ్మి గూడితే కేసులు పెట్టే పోలీసులు.. ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. వేల సంఖ్యలో ప్రజలను ఒకే చోటుకు చేర్చి కేసుల పెరుగుదలకు కారణం అవుతున్నారని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చెబుతోంది. ప్రస్తుతం కరోనా రాష్ట్రంలో అదుపులోనే ఉన్నా.. వేలు, వందల సంఖ్యలో ప్రజలు ఒకే చోటుకు చేరితే ఇప్పటికే మొదలైన థర్డ్ వేవ్ కోవిడ్ కేసులు తారాస్థాయికి చేరుతుందని హెచ్చరిస్తోంది ఆరోగ్యశాఖ. మరి ఇప్పటికైనా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజకీయ పార్టీలు వారి కార్యక్రమాలు చేసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read Also…

India Covid Deaths: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం .. వాస్తవ మృతుల సంఖ్య ఎంతంటే..? సర్వేలో షాకింగ్ విషయాలు

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.