Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Number 13: హోటల్‌లో రూం నంబర్ 13.. అంతస్తు13 ఎందుకు ఉండదో తెలుసా.. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే..

భారత్‌లో మూఢనమ్మకాలు ఎక్కువని తెల్లవారు ఆడిపోసుకుంటారు కానీ.. ఆమాటకొస్తే మనకంటే ఎక్కువ పిచ్చి నమ్మకాలు మనకంటే అక్కడివారికే ఎక్కువ. దెయ్యాలు, భూతాలు.. ఎలా ప్రతిదీ నమ్మేస్తుంటారు.

Number 13: హోటల్‌లో రూం నంబర్ 13.. అంతస్తు13 ఎందుకు ఉండదో తెలుసా.. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే..
Number 13
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 12, 2021 | 12:54 PM

Room Number 13: భారత్‌లో మూఢనమ్మకాలు ఎక్కువని తెల్లవారు ఆడిపోసుకుంటారు కానీ.. ఆమాటకొస్తే మనకంటే ఎక్కువ పిచ్చి నమ్మకాలు మనకంటే అక్కడివారికే ఎక్కువ. దెయ్యాలు, భూతాలు.. ఎలా ప్రతిదీ నమ్మేస్తుంటారు. అంతేందుకు అంకెళ్లోని కొన్నింటిని వారు అస్సులు టచ్ చేయరు. టచ్ చేయడమే కాదు ఆ నెంబర్ అంటే వణికిపోతారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాజ్యాలు అని మనం చెప్పుకునే ఆ దేశాలకు 13 నెంబర్ అంటే జ్వరం వచ్చిన కోడిలా మారిపోతారు. ఇక అమెరికాలోని సగం స్టార్ హోటళ్లలో 13వ నెంబర్ కనిపించదు. అంతేందుకు 13వ తేదీకి భయపడి అక్కడి ఉద్యోగులు సెలవులు కూడా పెడుతారు. అక్కడివారు ఏ నిర్మాణం చేసిన అందులో 13 వచ్చేలా ఏదీ ఉండదు.

అంతేందుకు వారు ఏ దేశంలో హోటళ్లను ఏర్పాటు చేసినా అందులో మీకు ఈ నెంబర్ మిస్ అవుతుంది. హోటళ్లలో రూమ్ నంబర్ 13  లేదని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది చాలా హోటళ్లలో జరుగుతుంది. చాలా హోటళ్లలో 13వ అంతస్తు కూడా ఉండదు. దీని కారణంగా లిఫ్ట్‌లో 12 తర్వాత నేరుగా బటన్ నంబర్ 14 ఉంటుంది. దీని వెనుక కారణం మీకు తెలియకపోవచ్చు! 

ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో 13 సంఖ్యను అశుభ సంఖ్యగా పరిగణిస్తారు. 13 సంఖ్యపై ప్రజల్లో ఒక రకమైన భయం ఉంది. ఈ భయం ఒక రకమైన ఫోబియా.. సంఖ్య 13 ఈ భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అంటారు. అందుకే ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లోని హోటళ్లలో రూం నంబర్ 13 గానీ, 13వ అంతస్తు గానీ ఉండవు. నేరుగా 12వ అంతస్తు తర్వాత 14వ అంతస్తు ఉంటుంది.

మీడియా వచ్చిన కథనాల ప్రకారం యేసుక్రీస్తును ఒకప్పుడు ఒక వ్యక్తి మోసం చేశాడట. ఆ వ్యక్తి యేసుతో కూర్చొని ఆహారం కూడా తిన్నాడు. నమ్మకద్రోహం చేసిన వ్యక్తి 13వ నంబర్ కుర్చీలో కూర్చున్నాడు. ఈ సంఘటన తర్వాత అమెరికా యూరప్ దేశాలలో 13వ సంఖ్యను అశుభకరమైనదిగా పరిగణించారు.

ఇప్పుడు ప్రపంచం గురించి మాట్లాడుకుంటే.. విదేశీ పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని చాలా పెద్ద హోటళ్లు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిర్మిస్తారు. అయితే విదేశీయులు ఎక్కడ హోటల్స్ నిర్మించినా అందులో కూడా 13 నంబర్ గదులను నిర్మించరు.

సంఖ్య 13 ఫోబియా ఇక్కడితోనే ముగియదు. ఫ్రాన్స్‌లో మిటింగ్ హాల్స్‌లో 13 కుర్చీలు ఉండటం కూడా దురదృష్టకరం. అంతెందుకు మీ రిజర్వేషన్ 13 నెంబర్ వచ్చిందనుకుందాం.. నెంబర్ లేకుండానే మీ వివరాలు అక్కడ కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి: MLC Elections: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్.. టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే…!

PM Modi Tribute: ఢిల్లీ చేరుకున్న రావత్ సహా 13 మంది పార్థివదేహాలు.. నివాళులర్పించిన ప్రధాని మోడీ