Dog take care of owner: కాలికి దెబ్బలతో యజమాని.. వేడికాపడం పెడుతున్న పెంపుడు కుక్క.. వైరల్ అవుతున్న వీడియో..
కుక్కకు విశ్వాసం ఎక్కువ అంటారు.. తనకు ఒక్క పూట ఆహారం పెట్టినవారి ఇంటికి కాపాలా కాస్తుంది. ఇక, పెంపుడు శునకాలైతే ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవడమే కాదు. యజమాని ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డేస్తుంది.
కుక్కకు విశ్వాసం ఎక్కువ అంటారు.. తనకు ఒక్క పూట ఆహారం పెట్టినవారి ఇంటికి కాపాలా కాస్తుంది. ఇక, పెంపుడు శునకాలైతే ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవడమే కాదు. యజమాని ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డేస్తుంది. కుక్క విశ్వాసానికి ఇప్పటికే అనేక సంఘటనలు చూశాం..తాజాగా మరో వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది.
ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ శునకం..తన యజమాని కోసం ఆరాటపడుతోంది. అతనికి పాదాన్ని ఏదో బలమైన దెబ్బ తగిలినట్లుగా అర్థమవుతోంది..నొప్పి నుంచి ఉపశమనం కోసం అతడు కాపడం పెట్టుకోవడం, మర్ధన చేయడం వంటివి చేస్తున్నాడు..అయితే, ఇదంతా ఆ కుక్క పక్కనే ఉండి గమనిస్తుంది..అతడు కాలి నొప్పితో పడుతున్న బాధను ఆ నోరులేని శునకం అర్థం చేసుకుంది..అందుకే తన పక్కనే కూర్చుని యజమానికి సేవలు చేస్తోంది. దెబ్బతగిలిన యజమాని కాలుని కుక్క తన నాలికతో నాకుతోంది..ఆ తర్వాత నొప్పిగా ఉన్న అతని కాలిపై వెచ్చగా ఉండేందుకు ఆ కుక్క తన మెడను వాల్చి పడుకుంటుంది..ఇదంతా వీడియో తీసిన ఆ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దాంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు కుక్క విశ్వాసానికి ఫిదా అవుతున్నారు. భిన్నమైన కామెంట్లతో కుక్కను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

