Crocodile: 13 అడుగుల భారీ మొసలిని పట్టుకున్న వేటగాడు.. కడుపులో 5 వేల ఏళ్లనాటి బాణం..
మొసలి కడపులో లభించిన బాణంను తన మిత్రుడైన ఆర్కియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ బాణాన్ని చూసిన అతను ఇది సమారు 5 వేల ఏళ్ల..
వింతలు, విశేషాలకు కొదవే లేదు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు కుప్పలు కుప్పలుగా వచ్చిపడుతున్నాయి. అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఒక జంతువులు మరో జంతువును వేటాడి తింటుంది. అది అడవిలోని పద్దతి. అయితే ఇలా తిన్న సమయంలో ఆ జంతువును మృగం పూర్తిస్థాయిలో జీర్ణం చేసుకుంటుంది. కొన్నిసార్లు అది జీర్ణం కాకుంటే ఆ తిన్న జంతువుపై భారీ ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతోంది. ఇందులో మొసలి కడుపులో ఇంత పాత కాలం వస్తువును గుర్తించాడు ఓ వేటగాడు.
షేన్ స్మిత్.. పెద్ద జంతువులను వేటాడటం ఇతని వృత్తి. ఓ రోజు వేటాడుతున్న సమయంలో ఓ భారీ మొసలి ఇతని వలకు చిక్కింది. అయితే మొదట ఇది గమనించిన వేటగాడు ఆశ్చర్యపోయాడు. మొసలి కడపులో లభించిన బాణంను తన మిత్రుడైన ఆర్కియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ బాణాన్ని చూసిన అతను ఇది సమారు 5 వేల ఏళ్ల నుంచి 6వేల సంవత్సరాల నాటి బాణంగా గుర్తించాడు. ఈ విషయాన్నిసోషల్ మీడియా వేదికగా పంచుకున్నడు. 336 కిలోల బరువున్న ఈ మొసలి 13 అడుగుల పొడవైనదిగా ఉందంటున్నాడు వేటగాడు.
మొసలి కడుపులో 5000 సంవత్సరాల పురాతన బాణం ..
షెన్ బాణాన్ని పరిశీలించినప్పుడు అది 5,000 సంవత్సరాల పురాతనమైన బాణంగా గుర్తించారు. మొసలి బాణాన్ని మింగినట్లు ఊహించాడు. షేన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో అలాగే ఆ మొసలి చిత్రాన్ని షేర్ చేశాడు. మొసలి కడుపులో చేపల ఎముకలు, పక్షి ఈకలు, బంతులు మొదలైనవి కూడా ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు.
అదనంగా, స్థానిక అమెరికన్లు ఫిషింగ్ కోసం బాణాలు, ప్లూమ్‌లను ఉపయోగించేవారని అలా వేటగాడు విసిరిన బాణంకు గాయపడిన ఓ చేపను ఈ మొసలి తినేసి ఉంటుందని వారు అంచనావేశారు. తాజాగా బాణంపై పెద్ద ఎత్తున పరిశోధనలు సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే..