Viral Video: కిలాడీలను మించిన దొంగ కుక్క.. గప్‌చుప్‌గా మటన్ ముక్క మాయం.. సీన్ చూస్తే నవ్వులే నవ్వులు..
Dog stealing bone Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కొన్ని క్యూట్‌గా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం
Dog stealing bone Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కొన్ని క్యూట్‌గా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇలాంటి వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలు చూస్తే.. ఆశ్చర్యంతోపాటు నవ్వు కూడా వస్తుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు నవ్వు ఆపుకోవడం కష్టమే.. జంతు ప్రపంచంలో కుక్కలు అత్యంత తెలివైనవి.. విశ్వాసానానికి ప్రతిరూపంగా నిలుస్తాయి. అలాంటి కుక్క దొంగిలించాడాన్ని చూశారా..? ఈ ఘటన చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక కుక్క ఇంట్లో హాయిగా నిద్రపోతుంటుంది.. దాని పక్కనే మరో కుక్క ఉంటుంది. దాని దగ్గర ఒక మటన్ ముక్క ఉంటుంది. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో నిద్రిస్తున్న కుక్క.. పక్కన ఉన్న శునకం చూపు మటన్ ముక్కపై పడింది. వెంటనే అంది గుట్టుచప్పుడు కాకుండా దాని పక్కకు చేరి.. కాలితో మటన్ ముక్కను లాక్కుంటుంది. ఇదంతా ఎలాంటి సౌండ్ రాకుండా.. కుక్క చాకచక్యంగా దొంగతనం చేస్తుంది. అనంతరం మటన్ ముక్కను నోటిన పట్టుకొని.. హ్యాపీగా పక్కకు వెళ్లి ఆరగిస్తుంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ సీన్ చూడండి.. వైరల్ వీడియో..
he’s stealing his brother’s bone while he’s asleep ? (jukin media) pic.twitter.com/RNwDyw1Xqv
— Humor And Animals (@humorandanimals) October 12, 2021
కాగా..ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్‌లో హ్యూమర్ అండ్ యానిమల్స్ అనే అకౌంట్ షేర్ చేసింది. నిద్రపోతుండగా.. అదును చూసి కుక్క దొంగతనం చేసిందంటూ క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. దీంతోపాటు ఈ వీడియోపై పలు కామెంట్లు కూడా చేస్తున్నారు. కుక్క దొంగతనం అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ దృశ్యం ఫన్నీగా ఉందని.. దీంతోపాటు అద్భుతంగా ఉందంటున్నారు.
Also Read: