Viral Video: ఆంటీని హగ్ చేసుకునేందుకు పర్మీషన్ కోరిన పాల బుగ్గల చిన్నారి.. సెక్యూరిటీ సిబ్బంది రియాక్షన్ ఇదీ..

Cute Baby Voiral Video: పసి పిల్లల చిలిపి చేష్టలు, వారి మౌన భాషకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Viral Video: ఆంటీని హగ్ చేసుకునేందుకు పర్మీషన్ కోరిన పాల బుగ్గల చిన్నారి.. సెక్యూరిటీ సిబ్బంది రియాక్షన్ ఇదీ..
Cute Baby Viral Video
Follow us

|

Updated on: Oct 16, 2021 | 12:05 PM

Cute Baby Viral Video: పసి పిల్లల చిలిపి చేష్టలు, వారి మౌన భాషకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. విమానాశ్రయంలో ఆంటీని హగ్ చేసుకునేందుకు ఓ పాల బుగ్గల చిన్నారి సెక్యూరిటీ సిబ్బంది పర్మీషన్ అడుగుతున్న క్యూట్ వీడియో ఇది. ఖతర్‌లోని హమద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు‌లో జరిగిన ఘటన ఇది. చిన్నారిని విడిచిపెట్టి ఓ మహిళ విమానమెక్కేందుకు వెళ్తున్నారు. ఇంతలో  క్యూట్ బేబీ ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లి.. తన ఆంటీ దగ్గరకు వెళ్లేందుకు పర్మీషన్ కావాలని సైగలతో అడుగుతుంది. వెంటనే సెక్యూరిటీ చెక్ పాయింట్‌ను దాటుకుని తన ఆంటీ వైపు పరుగులు తీస్తుంది. విమానం ఎక్కేందుకు వెళ్తున్న మహిళ కూడా.. ఆ చిన్నారి వైపు పరుగున వచ్చి హృదయానికి హత్తుకుంటుంది. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ చిన్నారి వైపు ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు.

సోషల్ మీడియాలో కేవలం 17 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను నెటిజన్లు తెగ వీక్షిస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలో ఈ వీడియోను దాదాపు 5.65 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను 60 వేల మందికి పైగా లైక్ చేశారు. క్యూట్ వీడియో ఎంతో నచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాల బుగ్గల చిన్నారి.. సెక్యూరిటీ చెక్ పాయింట్‌ను దాటుకుని వెళ్లి ఆంటీని కలుసుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను పదేపదే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టడం లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బంధాల విలువను చాటే పవర్ ఫుల్ వీడియో ఇది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో…

Also Read..

RK Roja: బాలకృష్ణకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే రోజా.. విషయం ఏంటంటే..

CRPF: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు.. రైలులో..