RK Roja: బాలకృష్ణకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే రోజా.. విషయం ఏంటంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ... సీనియర్ నటి రోజా కాంబినేషన్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..వీరిద్దరు

RK Roja: బాలకృష్ణకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే రోజా.. విషయం ఏంటంటే..
Roja Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ… సీనియర్ నటి రోజా కాంబినేషన్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..వీరిద్దరు జంటగా నటించిన బొబ్బిలి సింహం, భైరవద్వీపం చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.. అప్పట్లో ఈ జోడీకి అభిమానులు ఓ రేంజ్‏లో ఉండేవారు.. ఇప్పటికే రోజా, బాలకృష్ణ జంటగా అభిమానులున్నారు.. వీరిద్దరిని మరోసారి వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆశ పడుతుంటారు. వీళ్ల కాంబోలో వచ్చిన భైరవద్వీపం సినిమా విడుదలై సుమారు 28 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే వీరు ఇప్పటివరకు ఏ వేడుకలోనూ కలిసి కనిపించలేదు.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బాలయ్య బిజీగా ఉండగా.. నటి రోజా సైతం బుల్లితెర పై షోస్ చేస్తునే.. సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా నటి రోజా.. బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు..

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ షోలో రోజా, మనో జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జబర్ధస్త్ షో బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది. తాజాగా జబర్ధస్త్ షో వచ్చేవారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో ఎప్పటిలాగే కావాల్సిన కామెడీ పంచారు. చలాకీ చంటి.. సుధాకర్, శాంతిస్వరూప్, రాఘవ … తమదైన పంచులతో అలరించారు. ఇక ఆ తర్వాత.. యాంకర్ అనుసూయ.. మాట్లాడుతూ.. మేడమ్ మా అందరి సమక్షంలో ఇప్పుడు మీరు బాలకృష్ణ సర్ కు ఒక్కసారి కాల్ చేయాలి అని కోరుకుంటుంది. మంచి మూడ్‏లో ఉంటే ఓకే.. లేకపోతే.. అంటూ రోజా టెన్షన్ పడుతూ కాల్ చేస్తుంది. హల్ సర్ బాగున్నారా ? అని అడగ్గా.. రోజాగారు నమస్కారం.. బాగున్నానమ్మా.. మన అఖండ షూటింగ్ లో ఉన్నాను అని చెప్పారు బాలకృష్ణ.. అనంతరం మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం .. భైరవద్వీపం పార్ట్ 2 నా లేకా బొబ్బిలి సింహం పార్ట్ 2నా అని అందరూ అడుగుతున్నారు అని రోజా అనడంతో.. మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురూచూస్తున్నారు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా.. జబర్ధస్త్ జడ్జీగా తాను వస్తానని అంటూ నవ్వులు పూయించారు.

 

Also Read: pragya Jaiswal: రోజులు లెక్క‌పెడుతున్నాను అంటోన్న ప్ర‌గ్యా.. అందాల భామ‌కు ఎంత క‌ష్ట‌మొచ్చిందో.

Tollywood: ‘మా’ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఎవరెవరికి షాకులు.. ఎలాంటి సెన్సేషన్స్ ..!

Click on your DTH Provider to Add TV9 Telugu