Tollywood: ‘మా’ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఎవరెవరికి షాకులు.. ఎలాంటి సెన్సేషన్స్ ..!

ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మా కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. కాసేపట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. 'మా' అధ్యక్షుడిగా

Tollywood: 'మా' కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఎవరెవరికి షాకులు.. ఎలాంటి సెన్సేషన్స్ ..!
Manchu Vishnu Maa
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 16, 2021 | 11:34 AM

MAA – Manchu Vishnu: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మా కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. కాసేపట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేయనున్నారు. విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించనున్నారు.

విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అలాగే, పలువురు టాలీవుడ్ ప్రముఖులు అటెండ్ కానున్నారు. బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తదితరుల ఇంటికెళ్లి మంచు ఫ్యామిలీ స్వయంగా ఆహ్వానించింది.

మంచు విష్ణు ప్యానెల్ నుంచి మొత్తం 15మంది గెలిచారు. అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొడితే… ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు. వీళ్లంతా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్ నుంచి మొత్తం 11మంది గెలిచారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ… ఈసీ మెంబర్స్‌గా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేష్ కొండేటి, కౌశిక్, సుడిగాలి సుధీర్, సమీర్ విజయం సాధించారు. అయితే, వీళ్లంతా తమ పదవులకు రాజీనామా చేయడంతో ప్రమాణస్వీకారానికి వస్తారో లేదో.

‘మా’ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు హాజరవుతారు? ఎలాంటి సెన్సేషన్స్ నమోదవుతాయో చూడాలి? అలాగే, ప్రకాష్‌రాజ్ ప్యానెల్ మెంబర్స్ రాజీనామాలపై మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తి రేపుతోంది.

Read also: PM Modi: దేశ అభ్యున్నతి కోసం సాక్షాత్తూ భారత ప్రధానితో మీ ఆలోచనలు, సమస్యలు చెప్పాలనుకుంటున్నారా?

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్