MAA: అందరినీ కలుపుకుని వెళ్తానన్న మంచు విష్ణు.. ప్రమాణ స్వీకారం సమయంలో ఇలా చేయడమేంటంటూ ప్రశ్నలు.!

కొత్తగా ఎన్నికైన మా కార్యవర్గం ప్రమాణ స్వీకారం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేస్తారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో

MAA: అందరినీ కలుపుకుని వెళ్తానన్న మంచు విష్ణు.. ప్రమాణ స్వీకారం సమయంలో ఇలా చేయడమేంటంటూ ప్రశ్నలు.!
Manchu Vishnu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 16, 2021 | 11:47 AM

MAA Chairman Manchu Vishnu: కొత్తగా ఎన్నికైన మా కార్యవర్గం ప్రమాణ స్వీకారం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేస్తారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఇండస్ట్రీ పెద్దలకు మంచు విష్ణు ఆహ్వానం పంపారు. బాలకృష్ణను స్వయంగా వెళ్లి పిలిచారు. చిరంజీవిని మాత్రం ఆహ్వానించలేదని సమాచారం. ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ మెంబర్స్‌కు ఫోన్‌లో మాత్రమే మేసేజ్‌ పంపినట్లు తెలుస్తోంది. అందరినీ కలుపుకుని వెళ్తానన్న విష్ణు…ప్రమాణ స్వీకారం సమయంలో ఇలా చేయడం ఏంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

సాధారణంగా కొత్త కమిటీ ఏర్పాటైనప్పుడు దాని ప్రమాణ స్వీకారానికి ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని పిలవడం ఆనవాయితీ. ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరు కావాలని ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు, ఆయన తండ్రి డిఆర్సీ సభ్యులు మోహన్ బాబు ఇప్పటికే ఇండస్ట్రీలోని కొందరు పెద్దలకు ఫోన్లు చేసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లాంటివారిని స్వయంగా కూడా కలిశారు మోహన్‌బాబు. చిరంజీవిని కూడా వారు కలిసి ఆహ్వానిస్తారా లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. కొందరు విశ్లేషకులు ఊహించినట్టుగా విష్ణు నుంచి కానీ, మోహన్ బాబు నుంచి కానీ చిరంజీవికి ఎటువంటి ఆహ్వానం అందలేదు.

2015 నుంచి అధ్యక్షపదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతల్ని స్వీకరించడం ఆనవాయితీ. కానీ దానికి భిన్నంగా ప్రమాణ స్వీకారానికి ముందే బాధ్యతలు చేపట్టారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హాజరవ్వాలి అనే విషయంలో ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

2019 లొ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా సంఘానికి చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు కృష్ణంరాజు. ఇందులో మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధ, చిరంజీవి సభ్యులుగా ఉన్నారు. డీఆర్సీ నుంచి గతేడాది రాజీనామా చేశారు చిరంజీవి. అయితే దాన్ని అప్పట్లో సభ్యులు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన మంచు విష్ణు కార్యవర్గం డీఆర్సీని కొనసాగిస్తుందా లేదా, దానిలో మార్పులు చేర్పులు చేస్తుందా అనే విషయం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Read also: PM Modi: దేశ అభ్యున్నతి కోసం సాక్షాత్తూ భారత ప్రధానితో మీ ఆలోచనలు, సమస్యలు చెప్పాలనుకుంటున్నారా?