Adipurush: షూటింగ్ పూర్తిచేసుకున్న జానకి.. మిగిలింది ఇక రాముడి వంతే… చివరి దశలో ఆదిపురుష్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. అలాగే ఇందులో మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో.. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ.. ఇప్పుడు చివరి దశలో ఉంది..
అక్టోబర్ 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తిచేయాలని కసరత్తులు చేస్తున్నాడు ఓంరౌత్. ఇటీవలే ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ తన రోల్ షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ చిత్రయూనిట్ ఘనంగా రావణుడికి వీడ్కోలు పలికింది. తాజాగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్ సైతం షూటింగ్ కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా ఆదిపురుష్ చిత్రయూనిట్ కృతి సనన్కు ఘనంగా వీడ్కోలు పలికారు.. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓంరౌత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఇక సీత, రావణుడి పాత్రల షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక మిగిలింది మాత్రం రాముడి వంతు మాత్రమే. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతోపాటు.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంల సలార్ సినిమా చేస్తున్నాడు.. అలాగే ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ట్వీట్..
Dear Kriti, it was magical watching you play Janaki. Can’t believe your part is wrapped up. What a lovely journey!!!#Adipurush@kritisanon pic.twitter.com/hVsVrZiaAK
— Om Raut (@omraut) October 16, 2021
Trisha: డిజిటల్ పై సత్తా చాటేందుకు సిద్ధమైన స్టార్ హీరోయిన్.. ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న త్రిష..