Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA: ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్ నుంచి ఎన్నికై రాజీనామా చేసిన 11మంది నేటి ప్రమాణ స్వీకారానికి వస్తున్నారా?

ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మా కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. కాసేపట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు

MAA: ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్ నుంచి ఎన్నికై రాజీనామా చేసిన 11మంది నేటి ప్రమాణ స్వీకారానికి వస్తున్నారా?
Prakash Raj Panel
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 16, 2021 | 11:47 AM

MAA Swearing: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మా కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. కాసేపట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేయనున్నారు. విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించనున్నారు.

విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అలాగే, పలువురు టాలీవుడ్ ప్రముఖులు అటెండ్ కానున్నారు. బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తదితరుల ఇంటికెళ్లి మంచు ఫ్యామిలీ స్వయంగా ఆహ్వానించింది.

మంచు విష్ణు ప్యానెల్ నుంచి మొత్తం 15మంది గెలిచారు. అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొడితే… ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు. వీళ్లంతా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్ నుంచి మొత్తం 11మంది గెలిచారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ… ఈసీ మెంబర్స్‌గా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేష్ కొండేటి, కౌశిక్, సుడిగాలి సుధీర్, సమీర్ విజయం సాధించారు. అయితే, వీళ్లంతా తమ పదవులకు రాజీనామా చేయడంతో ప్రమాణస్వీకారానికి వస్తారో లేదో..

Read also: పోటెత్తిన భవానీ భక్తులు.. దీక్షల విరమణకు భారీగా తరలి వస్తున్న భక్త జనం.. కనకదుర్గ ప్లైఓవర్‌పై రెండు కిలోమీటర్ల మేర..

ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆ ప్లేయర్లపై ఓ కన్నెయడం ఖాయం!
ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆ ప్లేయర్లపై ఓ కన్నెయడం ఖాయం!
వేసవిలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
వేసవిలో తులసి మొక్క ఎండిపోతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
చేతిలో కొబ్బరి బోడం.. చిలిపితనంతో అల్లరి చేస్తున్న యంగ్ బ్యూటీ!
చేతిలో కొబ్బరి బోడం.. చిలిపితనంతో అల్లరి చేస్తున్న యంగ్ బ్యూటీ!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. చుక్కలు చూపిస్తున్న సూరీడు..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. చుక్కలు చూపిస్తున్న సూరీడు..
హీట్ వేవ్ కి క్రికెటర్ మృతి
హీట్ వేవ్ కి క్రికెటర్ మృతి
మీ ఫోన్‌కు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఎంత హానికరమో మీకు తెలుసా...?
మీ ఫోన్‌కు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఎంత హానికరమో మీకు తెలుసా...?
ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనీ.. కూతురికి ఓ తండ్రి శిక్ష
ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనీ.. కూతురికి ఓ తండ్రి శిక్ష
రోజ్ వాటర్‌ని ఎక్కువ ఉపయోగిస్తున్నారాచర్మానికి ఎంత హనికరమో తెలుసా
రోజ్ వాటర్‌ని ఎక్కువ ఉపయోగిస్తున్నారాచర్మానికి ఎంత హనికరమో తెలుసా
పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలు రవాణా..
పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలు రవాణా..
అశ్విన్ సెంచరీ టెస్ట్ డ్రీమ్.. ధోనీ సప్రైజ్ గిఫ్ట్!
అశ్విన్ సెంచరీ టెస్ట్ డ్రీమ్.. ధోనీ సప్రైజ్ గిఫ్ట్!