Kushboo Sundar: సన్నజాజి తీగలా మారిన కుష్బూ.. అదే కారణం అంటున్న నటి.. ఫోటోలు చూస్తే మీ కళ్లను మీరే నమ్మరు

Surya Kala

Surya Kala |

Updated on: Oct 16, 2021 | 5:14 PM

Kushboo Sundar: అందంగా, బొద్దుగా, ముద్దుగా ముద్దబంతి పువ్వులా ఉండే ఖుష్బూ ఒకప్పుడు తమిళ కుర్రకారు కలలు సుందరి. సిమ్లా యాపిల్ లా మెరిసిపోతూ ఉండే ఖుష్బూకి..

Kushboo Sundar: సన్నజాజి తీగలా మారిన కుష్బూ.. అదే కారణం అంటున్న నటి..  ఫోటోలు చూస్తే మీ కళ్లను మీరే నమ్మరు
Kushboo Sundar
Follow us

Kushboo Sundar: అందంగా, బొద్దుగా, ముద్దుగా ముద్దబంతి పువ్వులా ఉండే ఖుష్బూ ఒకప్పుడు తమిళ కుర్రకారు కలలు సుందరి. సిమ్లా యాపిల్ లా మెరిసిపోతూ ఉండే ఖుష్బూకి ఏకంగా తమిళనాడులో గుడి కట్టిన చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు తన అందంతో నటనతో కుర్రకారుని ఆకర్షించి డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన ఖుష్బూ 50 ఏళ్ళ వయసులోనూ తరగని అందం తన సొంతం అంటుంది. తాజాగా తాను 15 కిలోలు బరువు తగ్గానని కుష్బూ సుందర్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అవును బరువు వలన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి కొంతమంది వ్యాయామం, యోగ వంటివాటిపై ఆధారపడితే.. మరికొందరు సర్జరీలతో శరీరాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత కొన్ని నెలల క్రితం వరకూ ముద్ద బంతి పువ్వులా బొద్దుగా ఉండే ఖుష్బూ, ఇప్పుడు స్లిమ్ లో లుక్ లో మరింత అందంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన పర్సనల్ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేసే ఖుష్బూ .. తన పాత ఫోటోతో పాటు కొత్త ఫోటోను షేర్ చేసి.. 15 కేజీల బరువు తగ్గానని చెప్పారు.

View this post on Instagram

A post shared by Kushboo Sundar (@khushsundar)

80వ దశకంలో బాలీవుడ్ లో బాలనటిగా అడుగు పెట్టిన .. టాలీవుడ్ లో కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్ గా దక్షిణాదిన అడుగు పెట్టింది. ప్రస్తుతం ఓ వైపు నటిస్తూనే రాజకీయాల్లో అడుగు పెట్టి.. తనదైన శైలిలో రాణిస్తుంది. ఇప్పుడు ఖుష్బూ సుందరం గుర్తించలేని విధంగా మారిపోయింది.

తన లేటెస్ట్ ఫోటోలను గత ఫోటోలను షేర్ చేసిన కుష్బూ సుందర్ .. అప్పుడు .. ఇప్పుడునే క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఖుష్బూ గతంలో ఎన్నడూ లేనంత ఫిట్‌గా కనిపిస్తోంది. లాక్ డౌన్ సమయంలో 70 సొంతంగా ఇంటి పనులు చేసుకున్నానని.. అంతేకాదు డైట్ ని పాటిస్తూ.. ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నానని చెప్పారు.

దక్షిణాది స్టార్ హీరోలైన రజనీకాంత్, కమల్ హసన్, విజయకాంత్, శరత్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, సత్యరాజ్, వెంకటేష్, నాగార్జున, ప్రభు వంటి అగ్ర తారల సరసన కనిపించింది.

ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘అన్నాఠే’ లో నటిస్తుంది. ఇక తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ లో కనిపించనుంది.

Also Read: Venomous Spider: ఫోటోగ్రాఫర్ బెడ్‌రూమ్‌లో పిల్లలతో స్పైడర్ కాపురం.. అది కరిస్తే ప్రాణాలకే ప్రమాదం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu