Durga idol immersion: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. నమజ్జనం చేస్తుండగా ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి..

Durga idol immersion: దసరా పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులు.. విగ్రహ నిమజ్జనానికి నదికి తీసుకెళ్లారు. అనంతరం

Durga idol immersion: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. నమజ్జనం చేస్తుండగా ప్రమాదం.. ఐదుగురు యువకుల మృతి..
Up
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 16, 2021 | 9:45 AM

Durga idol immersion: దసరా పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులు.. విగ్రహ నిమజ్జనానికి నదికి తీసుకెళ్లారు. అనంతరం దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో.. ఐదుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దోల్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులందరూ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. దోల్పూర్ బేసిడి భూతేశ్వర్ ప్రాంతంలోని పార్వతి నది వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఐదుగురు యువకుల మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులందరూ యూపీ ఆగ్రా జిల్లాలోని జగ్నేర్ ప్రాంతానికి చెందినవారని.. విగ్రహ నిమజ్జనం కోసం రాజస్తాన్ బేస్డి ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ధోల్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ కేసర్ సింగ్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత దుర్గా విగ్రహం నిమజ్జనం కోసం ఆగ్రా జిల్లాలోని జగ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భువన్‌పురా గ్రామానికి చెందిన గ్రామస్తులు ఈ ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు. భూతేశ్వర్ దేవాలయం సమీపంలో పార్వతి నదిలో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందన్నారు. ఐదుగురు యువకులు దుర్గాదేవి విగ్రహంతో లోతైన ప్రాంతంలోకి వెళ్లారని.. అనంతరం మునిగి చనిపోయారన్నారు. దీంతో యూపీ భువన్‌పురా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగవేళ గ్రామంలోని ఐదుగురు యువకులు చనిపోవడంతో.. వారి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

Also Read:

CWC Meet: ఇవాళ సీడబ్ల్యూసీ కీలక భేటీ.. పార్టీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించే ఛాన్స్‌

MP David Amess: బ్రిటన్‌‌లో దారుణం.. సమావేశంలో ఎంపీ దారుణ హత్య.. పలుమార్లు కత్తితో..