CWC Meet: ఇవాళ సీడబ్ల్యూసీ కీలక భేటీ.. పార్టీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించే ఛాన్స్‌

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం..కరోనా తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగబోతోంది. జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పడానికి ప్లాన్‌ వేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.

CWC Meet: ఇవాళ సీడబ్ల్యూసీ కీలక భేటీ.. పార్టీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించే ఛాన్స్‌
Rahul
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 16, 2021 | 8:45 AM

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం..కరోనా తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగబోతోంది. జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పడానికి ప్లాన్‌ వేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరేయడానికి వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ. అటు పంజాబ్, ఛత్తీస్‌గడ్ ఇష్యూలను కూడా సెటిల్‌ చేసే పనిలో పడింది. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించడంతోపాటు కీలక భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు..భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ అధినేత్రి సోనియాతో పాటు రాహుల్‌, కాంగ్రెస్‌ అగ్రనేతలంతా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికలు, లఖింపూర్ ఖేరి ఘటన తదితర అంశాలే ప్రధాన ఏజెండాగా ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

పార్టీలో అధ్యక్షుడు లేకపోవడంతో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏం జరుగుతుందో తెలియటం లేదంటూ కపిల్ సిబల్‌ జీ-23 నాయకుల ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో…ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుతం సోనియా గాంధీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. హస్తం పగ్గాలను రాహుల్‌కు అప్పగించాలని కోరుతున్నారు చాలామంది నేతలు. దీంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది CWC భేటీలో. దీంతో పాటు పంజాబ్‌, యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు సభ్యులు.

కేవలం ఇవే రాష్ట్రాలు కాకుండా, ఇతర ప్రాంతాల్లోనూ పొత్తులు, వాటి వల్ల కలిగే లాభాల గురించి చర్చించనుంది CWC. మోదీ, అమిత్‌షా ప్రభావం ఎక్కువగా లేని ప్రాంతాలపై పాగా వెయ్యాలని, తద్వారా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని యోచిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.

ఇవి కూడా చదవండి: Crocodile: 13 అడుగుల భారీ మొసలిని పట్టుకున్న వేటగాడు.. కడుపులో 5 వేల ఏళ్లనాటి బాణం..