Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Purification: ప్రపంచ వ్యాప్తంగా పంచినీటి కొరత తీరుతుందంటున్న శాస్త్రవేత్తలు.. ఒక్క టాబ్లెట్‌తో స్వచ్ఛమైన నీరు..(వీడియో)

Water Purification: ప్రపంచ వ్యాప్తంగా పంచినీటి కొరత తీరుతుందంటున్న శాస్త్రవేత్తలు.. ఒక్క టాబ్లెట్‌తో స్వచ్ఛమైన నీరు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 15, 2021 | 10:26 PM

తాగునీటి విషయంలో శాస్త్రవేత్తలు ఒక పెద్ద శుభవార్త చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చాలా ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. అలాంటి ప్రదేశాల కోసం, శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన హైడ్రోజెల్ టాబ్లెట్‌ను సిద్ధం చేశారు. ఈ టాబ్లెట్ నదులు..

Water Purification: తాగునీటి విషయంలో శాస్త్రవేత్తలు ఒక పెద్ద శుభవార్త చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చాలా ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. అలాంటి ప్రదేశాల కోసం, శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన హైడ్రోజెల్ టాబ్లెట్‌ను సిద్ధం చేశారు. ఈ టాబ్లెట్ నదులు.. చెరువుల నీటిని ఒక గంటలోపు తాగడానికి పనికి వచ్చేలా చేస్తుందట. దీనికి సంబంధించిన నమూనా సిద్ధమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు . ఈ టాబ్లెట్ నీటిని 99.9 శాతం బ్యాక్టీరియా లేకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. నీటిని సాధారణంగా బాక్టీరియా రహితంగా మార్చడానికి మరగబెట్టి తాగుతారు. ఇది సమయం.. శక్తి రెండింటినీ ఖర్చు చేస్తుంది.అయితే, ఇప్పుడు కనిపెట్టిన కొత్త హైడ్రోజెల్ టాబ్లెట్‌తో నీటిని చాలా సులభంగా తాగడానికి పనికివచ్చే విధంగా సిద్ధం చేసుకోవచ్చు. ఈ హైడ్రోజెల్ టాబ్లెట్‌ను నది లేదా చెరువు నీటితో నింపిన కంటైనర్‌లో ఉంచాలి. ఒక గంట తర్వాత నీరు 99.9 శాతం బ్యాక్టీరియా లేకుండా స్వచ్ఛమైన నీరుగా తయారవుతుంది. తరువాత, ఈ టాబ్లెట్‌ను నీటిలో నుండి తీసివేయొచ్చు. నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం.. నీటిని చేరుకున్న తర్వాత, ఈ టాబ్లెట్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కార్బన్ కణంతో కలసి బ్యాక్టీరియాను చంపుతుంది. మానవుడికి హాని కలిగించే ఎలాంటి రసాయనాన్ని ఇది నీటిలో తయారు చేయదు. కనుక ఈ నీటిని ఎలాంటి భయం లేకుండా తాగవచ్చని చెబుతున్నారు.

అయితే ఈ హైడ్రోజెల్ మాత్రలు ఇతర నీటి శుద్దీకరణ పద్ధతులను మెరుగుపరచడానికి కూడా పని చేస్తాయట. ఉదాహరణకు, సౌర స్వేదనం నీటిని శుద్ధి చేయడానికి సూర్యుడి వేడి మీద ఆధారపడాలి. దానిలో అనేక సూక్ష్మజీవులు చేరే ప్రమాదం ఉంది. కొత్త హైడ్రోజెల్ టెక్నాలజీతో, ఈ నీటిని శుభ్రంగా శుభ్రపరచవచ్చంటున్నారు. హైడ్రోజెల్ టెక్నాలజీ నీటిని శుభ్రపరచడానికి చౌకైన, సులభమైన మార్గమని, ఈ టెక్నిక్ అన్ని రకాల కంటైనర్లకు ఉపయోగించడానికి సులభంగా ఉంటుందని చెబుతున్నారు… హైడ్రోజెల్‌ టాబ్లెట్ ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటి కొరతను తగ్గించడంలో గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడుతుందని పరిశోధకుడు గుయిహువా యు తెలిపారు. హైడ్రోజెల్ టాబ్లెట్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి తమ బృందం పనిచేస్తోందని పరిశోధనా బృందం చెబుతోంది. 
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: రెండగా చీలిన అతి పెద్ద బండరాయి.. అర్ధం కాక తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు..(వైరల్ వీడియో)

 Mechanic Jackpot Video: అదృష్టం మెకానిక్‌ తలుపు తట్టింది.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.. కోటిన్నర జాక్‌పాట్‌..(వీడియో)

 Viral Video: “నేను బిక్షగాడిని కాదు”.. ఓ కళాకారుడి ఆవేదన… నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

 Tree Top Hotel: అచ్చం పక్షిగూడులా..! అద్భుతమైన హోటల్‌.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!(వీడియో)