Viral Video: రెండగా చీలిన అతి పెద్ద బండరాయి.. అర్ధం కాక తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు..(వైరల్ వీడియో)
టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి వాటికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని విషయాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి వాటికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది ఓ పెద్ద బండరాయికి సంబంధించిన ఫోటో. ఆ బండరాయి సరిగ్గా మధ్యలో చీలిపోయి ఉంది. ఇందులో వింత ఏమిటంటే.. అంత పెద్ద రాయిని ఎవరో పదునైన చాకుతో రెండుగా చీల్చినట్లు కనిపిస్తోంది. కానీ అది మనుషుల వల్ల ఖచ్చితంగా సాధ్యమయ్యే పనికాదు. అందుకే ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. 30 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు కలిగిన ఈ బాహుబలి బండరాయిని సౌదీ అరేబియాలోని తైమా ఒయాసిస్‌లో ఉంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ రాయి అలా ఉండడానికి పలు రకాల కారణాలను చెబుతూ కామెంట్ చేస్తున్నారు. ఆ బండరాయిని గ్రహాంతరవాసులే అలా చీల్చి ఉంటారని కొందరు, వేరే గ్రహం నుంచి లేజర్ పాయింటర్ ద్వారా దాన్ని చీల్చి ఉంటారని మరికొందరు కామెంట్ చేశారు. అయితే…
బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గౌరవ పరిశోధనా సహచరుడు అయిన లూయిస్ ఈ రాయి వెనుక రహస్యాన్ని చేధించినట్లు తెలిపారు. ‘ఆ బండరాయి అలా సమానంగా చీలిపోవడానికి కారణం.. ఫ్రీజ్ థా వెదరింగ్ ఎఫెక్ట్ అని స్పష్టం చేశారు. నీళ్లు ఆ బండరాయి మీదకు చేరి.. దానికి పగుళ్లు ఏర్పడటంతో అలా సమానంగా చీలిపోయే అవకాశం ఉంటుందని.. దాన్నే ఫ్రీజ్ థా వెదరింగ్ ఎఫెక్ట్ అంటారని ఆయన స్పష్టం చేశారు. అయితే బండరాయి ఆ రకంగా సగానికి చీలే ప్రక్రియకు కొన్ని వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. లెవిస్ చెప్పిన విషయాన్ని కొందరు నమ్మినా.. మరికొందరు మాత్రం… ఏదో హైయ్యర్ టెక్నాలజీని ఉపయోగించి.. ఆ బండరాయిని అలా సమానంగా చీల్చారని కొందరు చెబుతున్నారు. మొత్తానికి అసలు విషయం అర్థం కాక.. పరిశోధకులు చెప్పిందానిపై అనుమానాలు తీరక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Mechanic Jackpot Video: అదృష్టం మెకానిక్ తలుపు తట్టింది.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.. కోటిన్నర జాక్‌పాట్..(వీడియో)
Viral Video: “నేను బిక్షగాడిని కాదు”.. ఓ కళాకారుడి ఆవేదన… నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Tree Top Hotel: అచ్చం పక్షిగూడులా..! అద్భుతమైన హోటల్.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!(వీడియో)
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

