Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drunker Viral Video: చనిపోయాడనుకుంటే..లేచి షాక్‌ ఇచ్చాడు..! ఖాకీలకే షాకిచ్చిన మందుబాబు..(వైరల్ వీడియో)

Drunker Viral Video: చనిపోయాడనుకుంటే..లేచి షాక్‌ ఇచ్చాడు..! ఖాకీలకే షాకిచ్చిన మందుబాబు..(వైరల్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 15, 2021 | 9:21 PM

ప్రకాశం జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి అందరిని టెన్షన్ పెట్టాడు.. చనిపోయాడనుకుంటే ట్విస్ట్ ఇచ్చాడు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం కూడలి సమీపంలోని పంట పొలాల్లో ఓ యువకుడు పడి ఉన్నట్లు కొందరు స్థానికులు గుర్తించారు..

ప్రకాశం జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి అందరిని టెన్షన్ పెట్టాడు.. చనిపోయాడనుకుంటే ట్విస్ట్ ఇచ్చాడు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం కూడలి సమీపంలోని పంట పొలాల్లో ఓ యువకుడు పడి ఉన్నట్లు కొందరు స్థానికులు గుర్తించారు.. చనిపోయాడని అనుమానించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పొలం బురదలో పడి ఉన్న వ్యక్తి చనిపోయాడని భావించారు. బయటికి తీయించేందుకు కొందరు మనుషుల్ని పిలిపించారు. దాదాపు గంట సమయం గడిచింది. అప్పటి వరకు ఎలాంటి కదలిక లేకుండా పడి ఉన్న వ్యక్తి అంతలోనే ఒక్కసారిగా పైకి లేచాడు..ఏం జరిగిందంటూ పోలీసులను ఎదురు ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. తానేదో ఓ క్వార్టర్‌ మందేసి హాయిగా పంట కాలువలో సేద తీరుతుంటే.. ఈ పోలీసుల హడావుడి ఏందన్నట్టుగా పోలీసులకేసి చీరగ్గా చూశాడు.. మృతదేహం కోసం వస్తే..మందుబాబు పైకిలేచి కూర్చోవడంతో ముందు పోలీసులు ఆగ్రహించినా ఆ తర్వాత నవ్వుకున్నారు..
తీరా సదరు మందు ఆచూకీ కోసం తెలుసుకోగా, తాను గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం త్రిపురాపురంకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. స్థానికంగా ఉన్న సోదరిని చూసేందుకు వచ్చినట్టు చెప్పాడు. మద్యం తాగిన మత్తులో నీళ్లున్న బీడు భూమిలోకి దిగి పడుకున్నట్లు చెప్పాడు. ఇదంతా చూసిన పోలీసులు అవాక్కయ్యారు. బురదగా ఉన్న అతని దుస్తుల్ని శుభ్రం చేయించి సొంత ఊరికి వెళ్లమని చెప్పి పంపించేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Hetero IT Raids: హెటిరోలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. రూ.550 కోట్ల నల్ల ధనం.. అన్నీ రూ.500నోట్లే..!(వీడియో)

 AP Crime: ఒంగోలులో వెలుగు చూసిన ఘరానా మోసం.. లేడీ హోంగార్డు ఏకంగా డీజీపీ పేరుతో..!(వీడియో)

 Ammavariki Alankarana: కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. కన్నుల పండగా వీడియో..

Fire in Running‌ Car: రన్నింగ్‌ కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అసలు ఏం జరిగింది..?(వీడియో)