Hetero IT Raids: హెటిరోలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. రూ.550 కోట్ల నల్ల ధనం.. అన్నీ రూ.500నోట్లే..!(వీడియో)

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదాలు యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అధికారుల సోదాల్లో బయటపడుతోన్న నగదు..అందరీని ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నాయి.

Hetero IT Raids: హెటిరోలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. రూ.550 కోట్ల నల్ల ధనం.. అన్నీ రూ.500నోట్లే..!(వీడియో)

|

Updated on: Oct 15, 2021 | 9:15 PM

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదాలు యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అధికారుల సోదాల్లో బయటపడుతోన్న నగదు..అందరీని ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల పాటు సాగుతోన్న సోదాల్లో అధికారులు వందల కోట్ల నగదును సీజ్‌ చేశారు. సంస్థ కార్యాలయాలతోపాటు ఫ్యాక్టరీలు, ముఖ్యమైన ఉద్యోగులు, అధికారుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి.
అధికారులు ఏకంగా 550 కోట్ల నల్ల డబ్బును గుర్తించినట్లు సమాచారం. ఇక ఇప్పటికే 142 కోట్ల నగదును సీజ్‌ చేశారు. ఇందులో భాగంగా ఓ బీరువాలో పెట్టిన డబ్బులకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ బీరువాలో ఉన్నవన్నీ 500 నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి..రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 4 రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. అక్రమ నగదును దాచడానికి పెద్ద ఎత్తున అట్టపెట్టెలను ఉపయోగించారు. మెడిసిన్‌ను నిల్వ చేస్తున్నట్లు ఎవరికీ అనుమానం రాకుండా అట్టపెట్టెల్లో ఏకంగా 142 కోట్ల రూపాయలు దాచినట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలను అధికారులు సీజ్‌ చేశారు. ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో అల్మారాలో ఏకంగా 5 కోట్లరూపాయల నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో బయటపడ్డ నగదును లెక్కపెట్టడానికే రెండు రోజుల సమయం పట్టిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి హెటిరో డ్రగ్స్‌ ఐటీ దాడుల వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా.? ఇంకా కొనసాగుతుందా ..? అన్నది మాత్రం వెచీ చూడాల్సిందే.

మరిన్ని చదవండి ఇక్కడ : AP Crime: ఒంగోలులో వెలుగు చూసిన ఘరానా మోసం.. లేడీ హోంగార్డు ఏకంగా డీజీపీ పేరుతో..!(వీడియో)

 Ammavariki Alankarana: కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. కన్నుల పండగా వీడియో..

Fire in Running‌ Car: రన్నింగ్‌ కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అసలు ఏం జరిగింది..?(వీడియో)

 Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

Follow us
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?