Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: “నేను బిక్షగాడిని కాదు.. ఓ కళాకారుడి ఆవేదన... నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: “నేను బిక్షగాడిని కాదు”.. ఓ కళాకారుడి ఆవేదన… నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Oct 15, 2021 | 10:09 PM

Viral Video: ప్రతిభ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలంటారు. ఇలా ప్రతిభ ఉండి అదృష్టం లేక ఓ కాళాకారుడు యాచకుడయ్యాడు. ఆ కథ ఏమిటో చూద్దాం. సామాజిక మాద్యమాల్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Viral Video: ప్రతిభ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలంటారు. ఇలా ప్రతిభ ఉండి అదృష్టం లేక ఓ కాళాకారుడు యాచకుడయ్యాడు. ఆ కథ ఏమిటో చూద్దాం. సామాజిక మాద్యమాల్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని వీడియోలు హృదయాన్ని ఆకర్షిస్తాయి. మరి కొన్ని వీడియోలు హృదయానికి తాకేలా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది.

నెంబరు అనేది వయస్సుకు మాత్రమే ప్రతిభకు కాదని ఓ వృద్ధుడు ఈ వీడియోలో నిరూపించాడు. ఢిల్లీ రాజధాని వీధుల్లో వృద్ధుడు వేణువుతో మధురమైన రాగాన్ని పలుకుతున్నాడు. అతడి ప్రతిభను చూసి పౌరులు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇంత ప్రతిభ ఉన్నా అతడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం రోడ్డుపై కూర్చోని వేణువు వాయిస్తున్నాడు. వాస్తవానికి విదేశాల్లో ప్రజలు భిక్షాటనకు చేతులు చాచడానికి బదులుగా బహిరంగ ప్రదేశంలో సంగీతం ప్లే చేసి డబ్బు సంపాదిస్తారు. ఢిల్లీకి చెందిన వృద్ధుడు అలానే చేస్తున్నాడు. అతడిని అందరు యాచకుడు అనుకుంటున్నారు. కానీ అతని వద్ద చిన్న బోర్డు ఉంది. అందులో “I Am Not Beggar” అని రాసి ఉంది. అందువల్ల అతడిని ఎవరూ బిచ్చగాడుగా పరిగణించలేరు. ఈ వీడియోను ఢిల్లీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ హిమాన్షి కుక్రేజా తన ఖాతాలో పంచుకున్నారు. “నేను భిక్షాగాడిని కాదు” అని అతని వద్ద బోర్డు ఉన్నప్పటికీ అతడికి తన బోర్డు కింద ఉన్న బట్టలో కొన్ని రూపాయలు వేస్తున్నారు. ‘నేను భిక్షాగాడిని కాదు..నేను సంగీతం సహాయంతో మీ ఆత్మను తాకాలని కోరుకుంటున్నాను’ అని రాసి ఉంది. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌చేస్తున్న ఈ వీడియోపై ప్రజలు వేగంగా స్పందిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Tree Top Hotel: అచ్చం పక్షిగూడులా..! అద్భుతమైన హోటల్‌.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!(వీడియో)

 Drunker Viral Video: చనిపోయాడనుకుంటే..లేచి షాక్‌ ఇచ్చాడు..! ఖాకీలకే షాకిచ్చిన మందుబాబు..(వైరల్ వీడియో)

 Hetero IT Raids: హెటిరోలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. రూ.550 కోట్ల నల్ల ధనం.. అన్నీ రూ.500నోట్లే..!(వీడియో)

 AP Crime: ఒంగోలులో వెలుగు చూసిన ఘరానా మోసం.. లేడీ హోంగార్డు ఏకంగా డీజీపీ పేరుతో..!(వీడియో)