IPL 2021 Winning Moments: ఎల్లో ఆర్మీ విన్నింగ్ మూమెంట్స్.. వైరలవుతోన్న ధోనీసేన ట్రోఫీ సంబురాలు(వీడియో)

చెన్నై సూపర్ కింగ్స్ టీం తుది పోరులో గెలిచి 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అద్భుత ఆటతీరుతో మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి 27 పరుగులతో విజయం సాధిచింది.

IPL 2021 Winning Moments: ఎల్లో ఆర్మీ విన్నింగ్ మూమెంట్స్..  వైరలవుతోన్న ధోనీసేన ట్రోఫీ సంబురాలు(వీడియో)
Ipl 2021 Csk Winning Moments
Follow us
Venkata Chari

|

Updated on: Oct 16, 2021 | 7:41 AM

IPL 2021 Final, CSK vs KKR: చెన్నై సూపర్ కింగ్స్ టీం తుది పోరులో గెలిచి 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అద్భుత ఆటతీరుతో మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి 27 పరుగులతో విజయం సాధిచింది. విజయం అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా‌ల నుంచి ట్రోఫీ అందుకున్న ధోనీ.. దానిని టీం మెంబర్స్‌కు అందించి సంబురాల్లో మునిగిపోయారు. ధోనీ నుంచి ట్రోఫీ తీసుకున్న దీపక్ చాహర్.. ఫొటోలకు ఫోజులిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సంబురాల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం దుమ్ము రేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి భారీ టార్గెట్‌ను ఉంచింది.

కీలకమైన ఫైనల్ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ తడబడింది. మొదటి నుంచి అద్భుతంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. భారీ స్కోర్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్ టీం ఆరంభం అదిరినా.. తొలి వికెట్ అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసి ఓటమిపాలైంది.

Also Read: CSK vs KKR, IPL 2021 Final Result: నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ధోనీ సేన.. ఫైనల్‌లో తడబడిన కోల్‌కతా..! (వీడియో)

IPL 2021 Final, CSK vs KKR: ఫైనల్లో చెలరేగిన చెన్నై బ్యాట్స్‌మెన్స్.. కోల్‌కతా ముందు 193 పరుగుల భారీ స్కోర్