ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్.. పాతాళలోకానికి వెళ్లిన ఫీలింగ్.. వీడియో చూస్తే అద్భుతం..

Deepest Swimming Pool : మీకు స్విమ్మింగ్ అంటే ఇష్టమా.. అయితే ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేయండి.

ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్.. పాతాళలోకానికి వెళ్లిన ఫీలింగ్.. వీడియో చూస్తే అద్భుతం..
Deepest Swimming Pool
Follow us
uppula Raju

|

Updated on: Jul 09, 2021 | 12:24 AM

Deepest Swimming Pool : మీకు స్విమ్మింగ్ అంటే ఇష్టమా.. అయితే ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేయండి. ఇందులో ఈత కొట్టడానికి దిగితే ఒక పాతాళలోకానికి వెళ్లిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. స్విమ్మింగ్ పూల్ కింది భాగంలో గేమ్స్ ఆడుకోవడానికి, కూర్చొడానికి తగిన ఏర్పాట్లు చేశారు. దీనిని ఒక మాయాలోకం మాదిరిగా తీర్చిదిద్దారు. దుబాయ్‌ ప్రభుత్వం ‘డీప్‌ డైవ్‌ దుబాయ్‌’ పేరుతోఅత్యంత లోతైన స్విమ్మింగ్‌ పూల్‌ను నిర్మించింది. ఇది గిన్నిస్ రికార్డు కూడా సాధించింది.

నాడ్‌ అల్‌ షెబా ప్రాంతంలో నిర్మితమైన ఈ స్విమ్మింగ్‌పూల్‌ను దుబాయ్‌ యువరాజు హమ్‌దాన్‌ బిన్‌ మొహమ్మద్‌ ప్రారంభించారు. అనంతరం ఈ పూల్‌కి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ‘‘60 మీటర్ల లోతున్న (196 అడుగులు) ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన పూల్‌ ‘డీప్‌ డైవ్‌ దుబాయ్‌’ మీ కోసం ఎదురుచూస్తోందని’’ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ పూల్‌ను ముఖ్యంగా డైవింగ్‌లో శిక్షణ తీసుకునే వారికోసం, నీటి లోతట్టు ప్రాంతాల్లో డైవింగ్‌ చేసే ఆసక్తి కలిగిన వాళ్ల కోసం ఏర్పాటు చేశారు.

దీనిలో పాడుబడిన నగరం ఆకృతులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. డైవింగ్‌ చేస్తూ పలు ఆటలు ఆడుకునే ఏర్పాట్లు చేశారు. ఈ పూల్‌లో ఉన్న 56 కెమెరాలు డైవింగ్‌ చేస్తున్న వారిని నిరంతం పర్యవేక్షిస్తుంటాయి. ఇందులోని నీరు 6 గంటలకు ఒక సారి శుద్ధి చేస్తారు. దీన్ని నింపడానికి 1.4 కోట్ల లీటర్ల నీటిని వినియోగించారు. నీటిని శుద్ధి చేయడానికి నాసా అభివృద్ధి చేసిన అధునాత వడపోత సాంకేతికతను ఉపయోగించినట్టు పూల్‌ నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే సందర్శకులకు అనుమతి ఉంటుందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది.

China : కుటుంబ నియంత్రణ పాటించని వ్యక్తికి రూ.3 కోట్ల ఫైన్.. చివరకు రూ.10 లక్షలకు తగ్గింపు..

Jammu Kashmir Encounter : సుందర్ బానీ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. అమరులైన ఇద్దరు జవానులు..

L Ramana: సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు : టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!