China : కుటుంబ నియంత్రణ పాటించని వ్యక్తికి రూ.3 కోట్ల ఫైన్.. చివరకు రూ.10 లక్షలకు తగ్గింపు..

China : చైనాలో ఓ విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్రణ పాటించకుండా 8 మందికి జన్మనిచ్చాడని ఓ వ్యక్తికి అక్కడి

China : కుటుంబ నియంత్రణ పాటించని వ్యక్తికి రూ.3 కోట్ల ఫైన్.. చివరకు రూ.10 లక్షలకు తగ్గింపు..
China
Follow us

|

Updated on: Jul 08, 2021 | 11:54 PM

China : చైనాలో ఓ విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్రణ పాటించకుండా 8 మందికి జన్మనిచ్చాడని ఓ వ్యక్తికి అక్కడి ప్రభుత్వం రూ.3 కోట్ల జరిమానా విధించింది. అయితే సదరు వ్యక్తి అంతమొత్తం చెల్లించలేనని వేడుకుంటే చివరకు రూ.10లక్షల రూపాయలకు తగ్గించారు. ఇద్దరికి మించి సంతానాన్ని కనకూడదనే చట్టం చైనాలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనాభాలో ఎక్కువ శాతం వృద్ధులే ఉంటున్నారని యంగ్ జనరేషన్ కోసం చైనా కొన్ని సవరింపులు చేసింది. ముగ్గురు సంతానం కలిగి ఉండేందుకు అనుమతిస్తూ చట్టాలను సవరించింది.

50 ఏళ్ల వయసున్న ఓ రైతు కుటుంబ నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇప్పటి వరకు 8 మంది సంతానానికి జన్మనిచ్చాడు. ఇద్దరు అబ్బాయిలు పుట్టే వరకు అతడు కుటుంబ నియంత్రణ పాటించలేదు. అతడికి మొదటి భార్య ద్వారా అయిదుగురు అమ్మాయిలు జన్మించారు. అనంతరం అమెకు విడాకులిచ్చి మరో మహిళను పెళ్లాడాడు. రెండో భార్యకు ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప పుట్టారు. అయితే పిల్లలందర్నీ పోషించేందుకు అతడి ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఆ అమ్మాయిని వేరొక కుటుంబానికి దత్తత ఇచ్చాడు. అధిక సంతానం నిబంధన ఉల్లంఘించిన రైతుకు అక్కడి ప్రభుత్వం ₹3 కోట్లు జరిమానా విధించింది.

2027 నాటికి చైనా దేశ జనాభాను పెంచే ఆలోచన చేస్తోంది. వార్షిక మరణాలు జననాల మధ్య తేడా వచ్చే ఐదేళ్లలో 10లక్షలకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తోంది. 2030 తర్వాత నుంచి చైనా జనాభా తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దేశంలో జననాలు కోటికి తగ్గి, మరణాలు కోటిపైగా ఉంటే చైనా జనాభా తగ్గుదల మొదలైనట్లే. అమెరికాలో జననాల రేటు రికార్డు స్థాయిలో 1.6శాతానికి చేరవైంది. ఒకరి కన్నా ఎక్కువ మంది పిల్లలు కనడం కోసం చైనా జంటలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించింది.

Jammu Kashmir Encounter : సుందర్ బానీ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. అమరులైన ఇద్దరు జవానులు..

L Ramana: సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు : టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ

KCR Vision: సీఎం దార్శనికతతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోంది : మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ భానుప్రసాద్