AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir Encounter : సుందర్ బానీ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. అమరులైన ఇద్దరు జవానులు..

Jammu Kashmir Encounter : జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలోని సుందర్ బానీ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వెంబడి

Jammu Kashmir Encounter : సుందర్ బానీ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. అమరులైన ఇద్దరు జవానులు..
Jammu Kashmir Encounter
uppula Raju
|

Updated on: Jul 09, 2021 | 12:36 AM

Share

Jammu Kashmir Encounter : జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాల నిరంతర నిఘా ఉన్నప్పటికీ ఉగ్రవాదులు చర్యలు ఆగడంలేదు. రాజౌరి జిల్లాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులు కూడా అమరవీరులయ్యారు. హతమార్చిన ఉగ్రవాదుల నుంచి రెండు ఎకె 47 రైఫిళ్లతో సహా భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా అధికారులు చెబుతున్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. జూన్ 29 న సుందర్బని సెక్టార్ దాదాల్ గ్రామంలో కొంతమంది అనుమానితులను నియంత్రణ రేఖలో చూశారు. వారికోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. దాదల్ అరణ్యాలలో ఒక గుహలో దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ ఆపరేషన్ సమయంలో సైన్యం తమ వద్దకు రావడాన్ని చూసి గ్రెనేడ్లను విసిరి కాల్పులు ప్రారంభించారు. తరువాత సైన్యం తేరుకొని ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మద్రాస్ రెజిమెంట్ ఆఫ్ ఆర్మీకి చెందిన నాయబ్ సుబేదార్ శ్రీజిత్, సిపాయి జస్వంత్ రెడ్డి అమరులయ్యారు. కాగా ఒక యువకుడు కూడా గాయపడ్డాడు. అమరవీరుల మృతదేహాలను సుందర్‌బని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే స్థానిక ప్రజలు ‘వీర్ జవాన్ అమర్ రహే, భారత్ మాతా కి జై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్’ నినాదాలు చేశారు. ఇది మొత్తం ఆ ప్రాంతంలో ప్రతిధ్వనించింది. అమరవీరులపై పూలమాలలు వేసి ప్రజలు నివాళులర్పించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అంతకుముందు రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం విఫలమైంది. ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని కాల్చి చంపారు. నియంత్రణ రేఖ వెంట చొరబడిన ఉగ్రవాదులను అరికట్టడానికి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు కూడా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల బృందం బుధవారం తెల్లవారుజామున రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖను దాటడానికి ప్రయత్నించిందన్నారు.

ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దేశంలో భారీగా విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులకూ తెగబడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే భారత సరిహద్దుల వెంట హై టెక్నాలజీ కెమెరాలను, సెల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశం సరిహద్దులు దాటుకుని వచ్చేందుకు కొందరు టెర్రరిస్టులు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా భారత జవాన్లపైకి కాల్పులకు తెగబడుతున్నారు.

KCR Vision: సీఎం దార్శనికతతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోంది : మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ భానుప్రసాద్

Anakapalli flyover: అనకాపల్లి ఫ్లై ఓవర్ కుప్పకూలడంలో వెలుగు చూసిన సంచలన విషయాలు

Sajjala: షర్మిల పార్టీపై స్పందించాల్సిన అవసరంలేదు : సజ్జల

యూపీలో బ్లాకు పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. మహిళపై దాడికి దుండగుల యత్నం..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌