AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ: న్యూజిలాండ్ టూర్‎కు టీమిండియా కెప్టెన్ ఛేంజ్.. గిల్ స్థానంలో శ్రేయస్.. ఎందుకంటే ?

IND Vs NZ: రాబోయే న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించే అవకాశం ఉంది. టైట్ షెడ్యూల్ కారణంగా రెడ్ బాల్ ప్రాక్టీస్ కోసం శుభ్‌మన్ గిల్ తోపాటు కొందరు సీనియర్లు చివరి రెండు వన్డేలకు దూరంగా ఉండనున్నారు. ఈ పరిణామం క్రికెట్ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది.

IND Vs NZ: న్యూజిలాండ్ టూర్‎కు టీమిండియా కెప్టెన్ ఛేంజ్.. గిల్ స్థానంలో శ్రేయస్.. ఎందుకంటే ?
Shreyas Iyer
Rakesh
|

Updated on: Sep 20, 2026 | 6:42 PM

Share

IND Vs NZ: వచ్చే అక్టోబర్ అలాగే నవంబర్ నెలలలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ దేశంలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు అలాగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఈ టూర్ షెడ్యూల్ చాలా టైట్‎గా ఉండటంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వన్డే సిరీస్ ముగిసిన వెంటనే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండటం ఆటగాళ్లపై తీవ్రమైన భారాన్ని మోపుతోంది. ఈ బిజీ క్యాలెండర్ కారణంగా జట్టు కూర్పులో మార్పులు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

గిల్ స్థానంలో పగ్గాలు అందుకోనున్న శ్రేయస్

వన్డే సిరీస్ చివరలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తోపాటు జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు సిరీస్‌ను మధ్యలోనే విడిచిపెట్టే అవకాశం ఉంది. టెస్ట్ మ్యాచ్‌లకు ముందు న్యూజిలాండ్ పిచ్‌లపై తగినంత ప్రాక్టీస్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఇలాంటి పరిస్థితులలో చివరి రెండు వన్డే మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. యంగ్ ప్లేయర్లతో కూడిన ఈ కీలక మ్యాచ్‌లలో అయ్యర్ కెప్టెన్సీ సామర్థ్యానికి అసలు పరీక్ష ఎదురుకానుంది.

కోచింగ్ సిబ్బందిలో కూడా మార్పులు

కేవలం ఆటగాళ్లు మాత్రమే కాకుండా భారత జట్టు కోచింగ్ సిబ్బంది కూడా రెండుగా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మూడో వన్డే ముగిసిన వెంటనే టెస్ట్ జట్టుతో కలిసి ప్రత్యేక శిక్షణకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు కొద్దిమంది సహాయక కోచ్‌లు కూడా టెస్ట్ ప్రిపరేషన్ కోసం పయనం కానున్నారు. మిగిలిన కోచింగ్ స్టాఫ్ మాత్రం వన్డే సిరీస్ పూర్తిగా ముగిసే వరకు పరిమిత ఓవర్ల జట్టుతోనే కొనసాగనున్నారు. షెడ్యూల్ ఒత్తిడి కారణంగా మేనేజ్‌మెంట్ ఈ వినూత్న ప్రణాళికను అమలు చేయాలని భావిస్తోంది.

టెస్ట్ సిరీస్ కోసం కఠిన సన్నాహాలు

భారత టెస్ట్ జట్టుకు తగిన సమయం దక్కాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కివీస్ గడ్డపై సవాల్‌తో కూడిన టెస్ట్ మ్యాచ్‌లలో రాణించాలంటే ముందుగా రెడ్ బాల్ క్రికెట్‌పై పూర్తి ఏకాగ్రత అవసరం. అందుకే కెప్టెన్ గిల్ స్వయంగా ముందే తగిన ప్రాక్టీస్ కోసం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తం పరిణామాలు రాబోయే సిరీస్‌ను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us