AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణపయ్యకు 501 రకాల నైవేద్యాలు.. పలాసలో మహాప్రసాదం మహోత్సవం ప్రత్యేక ఆకర్షణ!

వినాయక చవితి నవరాత్రులు వచ్చాయి అంటే అంతటా సందడే సందడి. వినాయక మండపాల వద్ద చవితి మొదలుకొని ప్రతి రోజు పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదాల వితరణ వంటివి కొనసాగుతున్నాయి. ఇక కొన్ని చోట్ల ప్రత్యేక హోమాలు, లక్ష పత్రికల పూజ అని, దీపారదనలు ఇలా ఒక్కో రోజు ఒక్కో రీతిన తమ శక్తి కొలది, భక్తి కొలది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు

S Srinivasa Rao
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 6:33 PM

Share
వినాయక చవితి నవరాత్రులు వచ్చాయి అంటే అంతటా సందడే సందడి. వినాయక మండపాల వద్ద చవితి మొదలుకొని ప్రతి రోజు పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదాల వితరణ వంటివి కొనసాగుతున్నాయి. ఇక కొన్ని చోట్ల ప్రత్యేక హోమాలు, లక్ష పత్రికల పూజ అని, దీపారదనలు ఇలా ఒక్కో రోజు ఒక్కో రీతిన తమ శక్తి కొలది,  భక్తి కొలది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

1 / 5
ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస పలాస MPDO కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేషుడికి ఆదివారం "మహాప్రసాదం మహోత్సవం" కాద్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో బాగంగా ఉండ్రాళ్ళ ప్రియుడైన ఆ గణనాథునికి నైవేద్యాలతో ముంచెత్తారు భక్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 501 రకాల విభిన్న నైవేద్యాలను సమర్పించారు.

2 / 5

స్వీట్, హాట్ లతో కూడిన లడ్డూలు, పులిహోర, పొంగలి, గారెలు, పాయసం, అరిసెలు, బూoది, బాదుషాలు,కాజాలు ఇలా వందలాది రకాల పిండివంటలతో, పండ్లు, ఫలహారాలతో స్వామివారి ముందు మహాప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసి స్వామివారికి సమర్పించారు.పండ్లు,ఫలహారాలను శోభాయమానంగా అలంకరించారు.

3 / 5

ఆ నైవేద్యాల శోభ చూపరులను మంత్రముగ్ధులను చేసింది. అన్ని రకాల ప్రసాదాలను ఒక్కసారిగా అలా చూసేసరికి ప్రసాదం ప్రియులకు నోరు ఊరిపోయింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, మహాప్రసాదాన్ని స్వీకరించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస MPDO కార్యాలయం వద్ద కొలువుదీరిన విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.

ఆ నైవేద్యాల శోభ చూపరులను మంత్రముగ్ధులను చేసింది. అన్ని రకాల ప్రసాదాలను ఒక్కసారిగా అలా చూసేసరికి ప్రసాదం ప్రియులకు నోరు ఊరిపోయింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, మహాప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా పలాస MPDO కార్యాలయం వద్ద కొలువుదీరిన విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.

4 / 5
భక్తి భావం, సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు స్థానికంగా అందరి మన్ననలు పొందుతున్నాయి. అందరిని ఐక్యత వైపుగా అడుగులు వేసేలా చేస్తున్నాయి. సాంప్రదాయ పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతోనే తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రోజూ భజనలు, హరికథలు, పూజా కార్యక్రమాలు చేపడుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

5 / 5
Follow Us